బిగ్‌బాస్ 4: దేత్త‌డి హారిక టాప్ 5లో వుంటుందా?

-

దేత్త‌డి హారిక ప‌క్కా తెలంగాణ పిల్ల‌. బిగ్‌బాస్ సీజ‌న్ 4లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. హైట్ కొంచెం త‌క్కువే అయినా వెయిట్ మాత్రం ఎక్కువే(టాలెంట్‌). `దేత్త‌డి` యూట్యూబ్ ఛాన‌ల్‌తో వైర‌ల్‌గా మారింది. త‌ను యూట్యూబ్‌లో చేసిన వీడియోల‌కు మిలియ‌న్‌ల వ్యూస్ రావ‌డంతో పాపుల‌ర్‌గా మారిపోయింది. అదే పాపులారిటీ హారిక‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ఎంట‌ర‌య్యేలా అవ‌కాశాన్ని క‌ల్పించింది.

16 మంది కంటెస్టెంట్‌ల‌లో 8వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హారిక అస‌లు పేరు అలేక్య హారిక‌. మొద‌టి వారం నుంచి నామినేష‌న్‌లో వుంటూ వ‌స్తున్న హారిక తొలి వారం నుంచి సేఫ్ అవుతూ వ‌స్తోంది. 8వ వారం మాత్ర‌మే హారిక నామినేషన్‌లో లేదు. రోబో టాస్క్ నుంచి చిన్న పిల్ల‌ల టాస్క్ వ‌ర‌కు హారిక బాగా పెర్ఫామ్ చేస్తూ వ‌స్తోంది. అభిజిత్‌… మోనాల్‌తో విడిపోయిన త‌రువాత నుంచి అత‌నికి ద‌గ్గ‌ర‌వుతూ వ‌స్తోంది.

అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో హారిక టాప్ 5లో వుంటుందా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. హారిక పాపులారిటీని బ‌ట్టి యూట్యూబ్ వ్యూస్‌ని బ‌ట్టి హారిక టాప్ 5లో ఖ‌చ్చితంగా వుంటుంద‌ని తెలుస్తోంది. అభిజిత్‌ని ఇష్ట‌ప‌డేవాళ్లు హారిక‌ని కూడా ఇష్ట‌ప‌డుతూ నామినేష‌న్‌లో వున్న ప్ర‌తీసారి ఓటింగ్‌తో సేవ్ చేస్తున్నారు. అంతే కాకుండా హారిక యూట్యూబ్ ఫాలోవ‌ర్స్ కూడా ఆమెని సపోర్ట్ చేస్తూ ఓటింగ్ చేస్తున్నారు. బ‌లమైన ఫాలోవ‌ర్స్ వుండ‌టంతో వారి కార‌ణంగా.. త‌న గేమ్ ప్లాన్‌తో హారిక టాప్ 5లో వుండేలానే క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news