బిగ్ బాస్: అభిజిత్, ఆరియానా మాట్లాడుకుంటే టాప్ 2 ఎవరో తెలిసిపోయింది..

Join Our COmmunity

బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో కెప్టెన్ గా చేసినవారిలో ఎవరు బాగా చేసారు, ఎవరు చెత్తగా చేసారో చెప్పమన్నప్పుడు నిన్న గాక మొన్న కెప్టెన్ అయిన హారిక బెస్ట్ కెప్టెన్ గా నిలిచింది. ఆరియానాని వరస్ట్ కెప్టెన్ గా నిలబెట్టారు. ఈ విషయంలో కంటెస్టెంట్స్ మధ్య పెద్ద చర్చే జరిగింది. అఖిల్, అభిజిత్ ల మధ్య రచ్చ మొదలైంది.

అదృష్టం కొద్ది అఖిల్ కెప్టెన్ అయ్యాడని అభిజిత్ అంటే, అదేం కాదు నువ్వు కావాలనే నన్ను వరస్ట్ అంటున్నావని అఖిల్ అన్నాడు. బెస్ట్ అండ్ వరస్ట్ కెప్టెన్లని ఎంపిక చేయడంలో ఓట్లు సరిగ్గా రాక లెక్క తేలకపోవడంతో అభిజిత్ ఆరియానాని వరస్ట్ గా ఎంపిక చేసి, సమస్యని ఓ కొలిక్కి తీసుకువచ్చాడు.

ఐతే ఇక్కడే ఓ విషయం అర్థమైంది. ఆరియానాని వరస్ట్ అన్న తర్వాత ఆమె దగ్గరికి వచ్చిన అభిజిత్, నువ్వు నా కంటే గేమ్ చాలా బాగా ఆడావు, నేను నీ అంత బాగా ఆడలేను అంటూ బుజ్జగించే ప్రయత్నం చేసాడు. దాంతో ఆరియానా, నేను ఏం బాగా ఆడలేదు. నువ్వే బాగా ఆడావు అని అభిజిత్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడింది.

వీరిద్దరూ ఈ విషయాలన్నీ మనసులోంచే చెప్పినట్లయితే బిగ్ బాస్ లో టాప్ 2లో ఉండేదెవరో చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. మొన్నటిదాకా అభిజిత్ టాప్ 2 ఉంటాడని అన్నారు. కానీ ఇప్పుడు అభిజిత్, తనకు తానే బాగా ఆడలేను అని చెబుతున్నాడు కాబట్టి టాప్ 2 లో సోహైల్, అఖిల్ ఉంటున్నట్లే అని అర్థం అవుతుంది.

ఆరియానా కంటే బాగా ఆడలేను అని చెప్పుకున్న అభిజిత్, టాప్ 5లో ఎవరెవరుంటారని బిగ్ బాస్ అడిగితే ఆరియానా పేరు చెప్పిన తర్వాత తన పేరు చెప్పుకుంటాడా అన్న సందేహం కలుగుతుంది. ఆరియానా కూడా అభిజిత్ తర్వాత తన పేరు ఇచ్చుకుంటుందా అనేది చూడాలి.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news