బిగ్ బాస్: హౌస్ లో రామ్ గోపాల్ వర్మ చిత్రం.. బాగా నవ్వించిందిగా..!

-

బిగ్ బాస్ హౌస్ లో దయ్యం ఎపిసోడ్ ఇంకా నడుస్తూనే ఉంది. జలజ పేరుతో కంటెస్టెంట్స్ అందరినీ భయపెడుతుంది. అతిగా భయపడుతున్న ఆరియానా ఒక్కతే కాదు హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ కూడా జలజ ధాటికి విలవిలలాడిపోతున్నారు. రామ్ గోపాల్ వర్మ 12వ అంతస్తు సినిమా చూపించి మరీ భయపెడుతుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ సినిమా చూపిస్తామని చెప్పి, 12వ అంతస్తు సినిమా చూపెట్టారు. ఐతే సినిమా మధ్యలో ఆపుచేస్తూ, ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అందులో భయానక వాతావరణాన్ని కలిగించి భయం కలిగేలా చేసాడు.

మొదటగా, ఆరియానాని పిలిచిన దయ్యం జలజ, ఆ తర్వాత మోనా, సోహైల్, అఖిల్ ని పిలిచింది. అవినాష్ తో పాటు వచ్చిన ఆరియానా, కన్ఫెషన్ రూంలోకి అడుగు కూడా పెట్టలేదు. అవినాష్ కారణంగా ఆరియానా బయటపడింది గానీ లేదంటే భయంతో చచ్చిపోయినంత పనిచేసింది. ఆరియానా భయపెడుతుంటే ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు ఎంతగానో నవ్వుకున్నారు. అందులో సోహైల్, అఖిల్ కూడా ఉన్నారు.

ఐతే వారి టర్న్ వచ్చేసరికి కథ మొత్తం మారిపోయింది. బయట ఎంతో ధైర్యవంతుడిగా కనిపించిన సోహైల్, లోపలికి వెళ్ళగానే పిరికివాడైపోయాడు. చీకట్లో చెంచా కోసం వెతుకుతూ, కన్ఫెషన్ రూంలో నుండి వచ్చే అరుపులకి అదిరిపడ్డారు. ముఖ్యంగా సోహైల్ అయితే మరీ భయపడ్డాడు. ఎంతకీ చెంచా దొరక్కపోయే సరికి అఖిల్ కూడా కాస్త గాబరాకి లోనయ్యాడు. మొత్తానికి హౌస్ లో రామ్ గోపాల్ వర్మ సినిమా చూపించి ప్రేక్షకులని బాగానే నవ్వించాడు. మరి అభిజిత్, హారికా ఇంకా కన్ఫెషన్ రూంకి వెళ్ళలేదు. మరి దయ్యం జలజ వారిద్దరినీ ఏ విధంగా భయపెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news