బిగ్ బాస్ 4 : దేవీ నాగవల్లి ఎలిమినేటెడ్

-

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 4’ విజయ వంతంగా మూడో వారానికి వచ్చేసింది. ఐపీఎల్ తో పోటీ ఉండడంతో ఈ షోలో రోజుకొక సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది బిగ్ బాస్ టీమ్. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే మొదటి వారంలో డైరెక్టర్ సూర్య కిరణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగానే ఈరోజు టీవీ 9 యాంకర్ దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయింది. నిజానికి ఈ వారానికి గానూ లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వీరిలో ఈ థర్డ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఆడియన్స్ కి సమాధానం దేవి అని తేలింది. మరి ఆమె ఎవరి మీద బిగ్ బాంబ్ అప్ల్లై చేస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news