కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (27-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (27-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 27th september 2020

1. దేశంలో 110 కంపెనీలు రోజుకు 5 లక్షలకు పైగా పీపీఈ కిట్ల‌ను ఉత్పత్తి చేస్తున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు. తగినంత సంఖ్యలో పీపీఈ కిట్లు రాకపోవడంపై గ‌తంలో రాష్ట్రాలు ఫిర్యాదు చేసేవ‌ని, కానీ ఇప్పుడు రాష్ట్రాలు పీపీఈ కిట్ల‌ను స్వేచ్చగా తీసుకుంటున్నాయ‌ని తెలిపారు.

2. దేశంలో గడచిన 24 గంటలలో 88,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త‌గా 1,124 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,92,533కు చేరుకుంది. 9,56,402 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 49,41,628 మంది కోలుకున్నారు. 94,503 మంది చ‌నిపోయారు.

3. తెలంగాణ‌లో కొత్త‌గా 1,967 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య‌ 1,85,833కు చేరుకుంది. 1100 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 30,234గా ఉన్నాయి. 1,54,499 మంది కోలుకున్నారు.

4. ప్ర‌ధాని నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ప్రశంసించారు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామ‌ని మోదీ వ్యాఖ్యానించ‌డంపై ఆయ‌న‌ను టెడ్రోస్ అభినందించారు.

5. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 18,056 క‌రోనాకేసులు న‌మోద‌య్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,39,232కు చేరుకుంది. 2,73,228 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

6. కోవిడ్ వ‌ల్ల గుండెతో సహా అనేక ఇతర అవయవాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఓ అధ్యయనం ద్వారా ఈ విష‌యం తెలిసింద‌ని అన్నారు.

7. ఏపీలో కొత్త‌గా 6,923 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరుకుంది. 5,708 మంది చ‌నిపోయారు. 64,876 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,05,090 మంది కోలుకున్నారు.

8. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,791 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,80,808కి చేరుకుంది. 5,25,154 మంది కోలుకున్నారు. 46,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 9,313 మంది చ‌నిపోయారు.

9. క‌రోనా వ్యాక్సిన్ ను సేక‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందా, లేదా అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం కోసం ప్ర‌జ‌లు ఇంకెంత కాలం పాటు వేచి ఉండాల‌ని ఆయ‌న అడిగారు.

10. ప‌శ్చిమ‌బెంగాల్‌లో అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్, మ‌ల్టీప్లెక్స్‌ల‌ను తెరిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేర‌కు అక్క‌డి ప్ర‌భుత్వం అందుకు అనుమ‌తులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news