బిగ్ బాస్: కన్నీరు పెట్టుకున్న గంగవ్వ..

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన గంగవ్వ కంటనీరు పెట్టుకుంది. నేటి ఎపిసోడ్ లో గంగవ్వ కన్నీరు పెట్టుకున్న వైనం అందరినీ కలచి వేసింది. జ్వరంతో బాధపడుతున్న గంగవ్వని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ ఆరోగ్యం గురించి అడిగాడు. అనారోగ్యం వల్ల కొంత ఇబ్బందిగా ఉందని, ఇక్కడా నేనుండలేనని, తలుపుకి తాళం వేసిన రూమ్ లో ఉండలేనని బిగ్ బాస్ కి విన్నవించుకుంది. రెండు నెలలైనా బిగ్ బాస్ లో ఉందామని వచ్చానని, కానీ కుదరట్లేదని చెప్పింది.

ఇల్లు బాగాలేదని, దాని గురించి ఇక్కడిదాకా వచ్చానని, కనీసం నెలయినా ఉందామనుకున్నానని, అందరూ తనని బాగానే చూస్తున్నారనీ, అవ్వ అవ్వ అంటూ మంచిగ పలకరిస్తున్నారని, కానీ నాకే ఉండబుద్ధి కావడం లేదని కన్నీళ్ళు పెట్టుకుంది. తన భర్త పెట్టిన ఇబ్బందులు, కొట్టిన దెబ్బల వల్ల నడుం నొప్పి వచ్చిందని, దానివల్ల ఇప్పుడు ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చింది. ఐతే గంగవ్వకి ధైర్యం చెప్పడానికన్నట్టు బిగ్ బాస్ మాట్లాడుతూ, ఆరోగ్యం కోసం డాక్టర్లున్నారనీ, మీకు చాలా ధైర్యం ఉందనీ గంగవ్వని సముదాయించే ప్రయత్నం చేసాడు. అయినప్పటికీ గంగవ్వ ఏడుస్తూనే ఉంది. తాను ధైర్యవంతురాలినని తనకి తెలుసని చెబుతూనే, ఇంటికి వెళ్తానని రిక్వెస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version