బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. సాయికుమార్‌

-

బిగ్‌బాస్ 4 షో రంజుగా సాగుతుంది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నార‌న్న‌ది సస్పెన్స్ కాగా వైల్డ్ కార్డ్‌ ఎంట్రి అంటూ అంటూ మ‌రో స‌స్పెన్స్‌కి తెర తీశాడు బిగ్‌బాస్‌.

క‌రోనా నేప‌థ్యంలో సినిమా సెలెబ్రిటీలు బిగ్‌బాస్‌పై అంత‌గా ఇంట్రెస్ట్ చూప‌క‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న‌వారిని తీసుకున్నారు. గ‌త సీజ‌న్ కంటే కూడా ఈ సీజ‌న్‌కు 5 కోట్ల పై చిలుకు ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఎలిమినేష‌న్కి ఏడుగురు కంటెస్టంట్స్ రాగా.. అభిజిత్‌, జోర్దార్ సుజాత‌, గంగ‌వ్వ‌లు సేవ్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో ఈ రోజు తెలుస్తుంది.

ఇక హౌస్‌లోకి కొత్త కంటెస్టంట్ని తీసుకువ‌స్తున్నారు. ఈ రోజుల్లో, బస్‌స్టాప్‌, ల‌వ‌ర్స్ మూవీలో కామెడీ పాత్ర చేసిన సాయి కుమార్ పంప‌న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. సాయికుమార్ ని కూడా 14 రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉంచి క‌రోనా నెగెటివ్ వ‌చ్చాకే తీసుకువ‌స్తున్నార‌ట‌. ఇప్ప‌టికే గంద‌ర‌గోళంగా ఉన్న హౌస్‌లోకి అడుగు పెడుతున్న సాయి కుమార్ ఎంతమేర‌కు ఆక‌ట్టుకుంటాడు చూద్దాం. ఈ ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స‌రిపెడ‌తాడా లేక ఇంకొకర్ని తీసుకువ‌స్తాడా ఏమో బిగ్‌బాస్ లో ఏదైనా సాధ్య‌మే..

Read more RELATED
Recommended to you

Latest news