బిగ్ బాస్: అప్పు తీర్చేసిన హారిక.. ఆ అదృష్టం మోనాల్ కే దక్కనుందా..?

-

బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ నామినేషన్లలో నుండి సేవ్ అవుతూ చివరి వారం వరకూ కొనసాగుతున్న మోనాల్, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజానికి మొదటి వారంలోనే ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అనీ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ విషయంలో బిగ్ బాసే కావాలని మోనాల్ ని ఉంచాడని, నిజానికి ఇన్ని రోజులు ప్రయాణం చేయాల్సిన కంటెస్టెంట్ కాదని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి.

అదంతా పక్కన పెడితే, తాజాగా ఈ రోజు ఎపిసోడ్ లో మోనాల్, రెండు టాస్కుల్లో విజేతగా నిలిచింది. సెల్ఫీలు దిగాలని చెప్పిన టాస్కులోనూ, డాన్సు చేయాలని చెప్పిన టాస్కులో విజేతగా నిలిచి, గోల్డెన్ మైక్ గెలుచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యూజిక్ వినబడినంత సేపు డాన్సు చేయాలనే టాస్కులో హారిక సాయం చేసింది. హారిక కెప్టెన్ అవడానికి కారణమైన మోనాల్ ని గెలిపించడం కోసం డాన్స్ ఫ్లోర్ నుండి కిందకి దిగేసింది.

నువ్వు అప్పుడు సాయం చేసావ్ కాబట్టి, నేను రీపే చేస్తున్నానని చెప్పి మరీ కిందకి దిగింది. ఒకే రోజు రెండు టాస్కుల్లో గెలిచేసిన మోనాల్, బిగ్ బాస్ విజేతగా అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. నిజానికి ఈ వారం ఎలిమినేషన్ అవ్వాల్సింది మోనాలే అని గత వారమే వార్తలు వచ్చాయిఉ. కానీ హౌస్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి మోనాల్, ఈ వారం సేఫ్ అయ్యేలా ఉందని చెప్పుకుంటున్నారు.

రేపటి ఎపిసోడ్లో నాగార్జున గారు వస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ మోనాల్, విజేతగా నిలిస్తే, బిగ్ బాస్ తెలుగు సీజన్ గెలిచిన మొదటి అమ్మాయిగా రికార్డు సృష్టిస్తుంది. మరేం జరగనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news