అమ్మ కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ హరితేజ..!

-

బుల్లితెరపై హరితేజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా పరిచయం అయిపోయింది. ముఖ్యంగా ఈమె బుర్రకథలు కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. తొలి సీజన్‌లో ఫైనల్ వరకు వచ్చి అందరి మనసులు దోచుకుంది హరితేజ. కొన్ని సినిమాల్లో అలాంటి పని మినిషి పాత్రలే చేసింది హరితేజ. ఆ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2లో రాజేంద్ర ప్రసాద్‌తో ఈమె కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి గర్భంతో ఉంది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.

hariteja
hariteja

అయితే నిండు గర్భంతో కూడా డాన్సులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఈమెకు పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లాక్‌డౌన్ ముందు వరకు కూడా బిజీగానే ఉన్న హరితేజ.. లాక్ డౌన్‌లో మాత్రం ఇంటికే పరిమితం అయిపోయింది. చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చినా కూడా గర్భం దాల్చడంతో వాటికి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత కరోనా కూడా వచ్చేసింది. దాంతో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి కొన్ని నెలలుగా దూరంగానే ఉంది ఈ బిగ్ బాస్ భామ. ఈమెకు పెళ్లైందనే విషయం బిగ్ బాస్‌కు వచ్చే వరకు కూడా ఎవరికీ తెలియదు.

ఇక ఇప్పుడు ఈమె గర్భం దాల్చడంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. మీకు మీ అంత అందమైన బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే తనకు కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళందరికీ హరితేజ కూడా తిరిగి కృతజ్ఞతలు చెబుతుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్నందును సినిమాలకు దూరంగానే ఉంది ఈ భామ. వచ్చే ఏడాది చివర్లో కానీ మళ్లీ ఇండస్ట్రీ వైపు చూసేలా కనిపించడం లేదు ఈమె.

Read more RELATED
Recommended to you

Latest news