దివి నుండి దిగి వచ్చావా బిగ్ బాస్ బ్యూటీ..

-

ఎప్పటి నుండో సినిమాలు చేస్తున్నా రాని గుర్తింపు ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వచ్చేస్తుంది. అలా చాలా సినిమల్లో కనిపించినప్పటికీ అంతగా గుర్తింపు రాకుండా మిగిలిపోయిన భామని ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకి చేరవ చేసింది బిగ్ బాస్. ఆ భామ ఎవరో కాదు నందినీ రాయ్.. మాయ, మోసగాళ్లకి మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని సినిమాల్లో కనిపించిన నందినీ రాయ్ కి నటిగా సరైన గుర్తింపు రాలేదు.

ఇటీవల ఆహాలో రిలీజైన మెట్రో కథలు సినిమాలో నందినీ రాయ్ నటించింది.
జర్నలిస్ట్ ఖదీర్ బాబు రాసిన కథలతో తెరకెక్కించిన ఈ నాలుగు కథల మెట్రో కథలు సినిమాలో ఒకానొక పాత్రలో కనిపించింది. అందులో ఆమె పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ డిస్టేన్స్ రిలేషన్ షిప్స్ పెళ్లయిన వారిని ఏ విధంగా ఇబ్బంది పెడతాయని చక్కగా చూపించారు. భర్త కెరీర్ బిల్డప్ చేసుకునే పనిలో భార్యని అంతగా పట్టించుకోకుండా తిరిగితే ఆ భార్య ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొన్నదనేది చాలా బాగా చూపించారు. భార్యగా నందినీ చాలా చక్కగా చేసిందని ప్రశంసలు దక్కాయి.

ఇప్పుడిప్పుడే నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్లతో అభిమానులతో టచ్ లో ఉంటుంది. మత్తెక్కించే ఫోటో షూట్లతో సోషల్ మీడియా ఫాలోవర్లని పెంచుకుంటూ వెళ్తుంది. తాజగా ఆమె ఫాలోవర్లతో పంచుకున్న ఫోటో వైరల్ అయ్యింది. మత్తెక్కించే కళ్ళతో, మైమరిపించే సొగసుతో అందాలని ఆరబోస్తూ అందరినీ కనువిందు చేసింది. పింక్ కలర్ బాడీ సూట్ లో అందరినీ కట్టి పడేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫాలోవర్లు మరింతగా పెరుగుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news