ప్రభుత్వం కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంత కాలంగా ఈ శాఖ అవినీతిపై విసిగివేసారి పోయి వున్నారు. తెలంగాణ భామూలన్నీ ఆంధ్రా వాళ్లకు అప్పనంగా కట్టబెట్టిందే ఈ శాఖ అని, హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని భూములన్నీ ఆంధ్రుల చేతికి చిక్కడం వెనక ఈ శాఖలో పనిచేసిన వారి చేతి వాటం వుందని, కోట్ల విలువ చేసే భూముల్ని అన్యాక్రాంతం కావడానికి కూడా రెవెన్యూ శాఖనే కారణమని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ ఆ శాఖ ప్రక్షాళన కోసం తాజగా నడుం బిగించారు.
అక్రమ లేవుట్‌లు, హైదరాబాద్‌లో వున్న వందలాది చెరువులు, చెరువు శిఖం భూములు అక్రమార్కులకు కల్పతరువుగా మారడానికి రెవెన్యూ శాఖలోని నాగరాజు లాంటి కొంత మంది లంచావతారులే కారణమని కేసీఆర్ నమ్మిందే ఇటీవల నిజమని రుజువైంది కూడా. దీంతో LRS పేరుతో తెలంగాణ సర్కార్ రెవెన్యూ శాఖపై కొరడా విధించింది. ఇందులో అక్రమ లేవుట్‌లకు అర్హత లేదు. అనధికార లే అవుట్‌లకు తాజా చట్టంలో చోటు లేదు.
దీంతో రెవెన్యూ శాఖలోని లంచావతారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కానీ ఆ విషయం తెలియక పైసా పైసా కూడబెట్టుకుని పిల్లల పెళ్లి కోసమని మధ్య తరగతి ప్రజలు కొన్న స్థాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం వుంది. LRS అలాంటి సామన్యుల పాలిట మాత్రం నిజంగా శాపంగా మారే అవకాశం వుందని సర్వత్రా వినిపిస్తోంది.