బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ.. ఏకంగా హాలీవుడ్ చిత్రంలో..?

-

తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుని తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది సాక్షి అగర్వాల్. కేవలం సినిమాల తోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బిగ్ బాస్ తమిళం సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులకు దగ్గరయ్యింది. ఇక ఎన్నో రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీ కి బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఏకంగా హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు అవకాశం దక్కించుకుంది బిగ్ బాస్ బ్యూటీ సాక్షి అగర్వాల్. వల్ల దేశం చిత్ర దర్శకుడు ఎన్టీ నంద ప్రస్తుతం 120 అవర్స్ అనే ఓ హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాక్షి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ కి మంచి ఆదరణ లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news