బిగ్ బాస్ 3 లేటెస్ట్ ప్రోమో.. అదిరిపోయింది..!

-

హహ.. మనసు కోతి లాంటింది. మరి అలాంటి మనసు ఉన్న మనుషులు ఓ ఇంట్లో చేరితే.. మమకారంతో, వెటకారంతో వారిని ఏకతాటిపైకి తెచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి గల వ్యక్తి ఎవరు? అంటూ ఓ స్వామీజీ భక్తులకు ప్రవచనాలు చెబుతుండగా.. బయట ఓ పిల్లాడు, యువకుడు బిగ్ బాస్ 3 పోస్టర్లు అంటిస్తుంటారు.

ఇంతలోనే బిగ్ బాస్ 3 హోస్ట్ నేనే అన్నట్టుగా.. వాళ్లందరినీ నేనే నడిపిస్తా.. అన్నట్టుగా ముసుగేసుకొని ఉన్న ఓ వ్యక్తి అక్కడి నుంచి వేలు చూపిస్తూ వెళ్తుంటాడు. కొంచెం దూరం వెళ్లాక వెనక్కి తిరిగి తన ముఖాన్ని చూపించినట్టే చూపిస్తాడు కానీ సరిగ్గా అర్థం కాదు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జునే. అది బిగ్ బాస్ 3 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో.

త్వరలో బిగ్ బాస్ 3 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే కదా. హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయ్యాడు. ఆయన ఇటీవలే ప్రోమో షూటింగ్ లోనూ పాల్గొన్నారు. కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయ్యిందట. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 3 ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన స్టార్ మా.. తాజాగా లేటెస్ట్ ప్రోమోను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version