బిగ్ బాస్: 13వ వారం కూడా డబుల్ ఎలిమినేషన్..!

బిగ్బాస్ ఆరవ సీజన్లో 13వ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిపి బిగ్ బాస్ షాక్ ఇచ్చింది. అయితే ఈ 13వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారమైనా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే ఈసారి మాత్రం దీనిపై ప్రేక్షకులు పెద్దగా మక్కువ చూపలేదు. ఫలితంగా ఈ సీజన్ నిరాశ జనకంగానే మొదలయింది. అయితే ఇప్పుడు కొత్త కొత్త టాస్కులు ఇవ్వడంతో చాలా ఆసక్తికరంగా సాగుతోంది.

13వ వారంలో భాగంగా నామినేషన్ టాస్కులు గొడవలతో సాగాయి. ఇందులో రేవంత్, ఆదిరెడ్డి , కీర్తి భట్, జబర్దస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా ఇనయ సుల్తానా, ఓట్లు పడని కారణంగా శ్రీహన్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ప్రస్తుతం ఊహించనట్లుగానే ఉంది. అయితే ప్రతివారం ఓటింగులో ట్విస్ట్ లు ఉన్నట్లుగానే ఈ వారం కూడా ట్విస్ట్ ఏర్పడింది. ముఖ్యంగా 13వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించి కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చింది బిగ్ బాస్.

13వ వారం కూడా టైటిల్ ఫేవరెట్ గా సింగర్ రేవంత్ మొదటి స్థానంలో ఉంటూ ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నాడు. అతడి తర్వాత రెండవ స్థానంలో మంచోడిగా పేరు తెచ్చుకున్న రోహిత్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మూడో స్థానంలో కీర్తి భట్, నాలుగవ స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో ఆదిరెడ్డి, ఆరో స్థానంలో ఫైమా ఉన్నారని సమాచారం.. ఆరో సీజన్లు ఫినాలే కి ముగ్గురు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ రెండు వారాలే ఉన్నాయి. అందుకే 13వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం . వచ్చేవారం ఒకరిని పంపించి ఫినాలేకు టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లబోతున్నారు.

ప్రస్తుతం ఓట్లు తక్కువగా ఉండడం వల్ల ఆదిరెడ్డి, ఫైమా చివర్లో ఉన్నారు కాబట్టి వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.