కొరియన్ మహిళా యూట్యూబర్‌పై వేధింపులు.. లైవ్‌ స్ట్రీమింగ్‌లో బలవంతంగా..

-

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసినా.. కోర్టు ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడంతో లేదు. యువతి కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు దిగుతున్నారు. అయితే.. కొరియన్ మహిళా యూట్యూబర్‌పై ముంబైలో కెమెరా సాక్షిగా కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. ముంబై సబర్బ్‌లోని ఖర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా కొందరు యువకులు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. దానికి ఆమె ‘నో.. నో’ అని అరవడం కనిపించింది. ఆమె ప్రతిఘటిస్తున్నా వదలని యువకుడు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లాడు.

Korean woman YouTuber harassed on Mumbai street during live stream | Video - India Today

ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. వారు లిఫ్ట్ ఇస్తామని చెబుతూ బైక్ వద్దకు తీసుకెళ్లగా, నిరాకరించిన ఆమె తన ఇల్లు సమీపంలోనే ఉందని వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్పింది. ఈ వీడియోను రీట్వీట్ చేసిన బాధిత యువతి.. ఆ యువకుడితోపాటు మరో వ్యక్తి ఉండడంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది. గత రాత్రి తాను లైవ్ స్టీమ్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు వివరించింది. తాను మరీ అంత స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారని, దీంతో స్ట్రీమింగ్ గురించి ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news