బిగ్ బాస్: బాలాదిత్య కంటతడి.. శునకానందం పొందిన గీతూ..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ 9వ వారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో గలాటా గీతూ రోజురోజుకు దిగజారిపోతుంది. పక్కవారి ఆటలను విశ్లేషిస్తూ తన స్థాయి ఏంటి అన్నది తాను చూసుకోలేకపోతోంది. అంతేకాదు బాలాదిత్య చాలా మంచి వాడని .. ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత మంచిది అంటూ చెప్పింది గీతూ.. ఒక బాలాదిత్యాను మాత్రమే కాదు రేవంత్ ని కూడా అంతే త్వరగా వెళ్తే మంచిది అంటూ రివ్యూలు ఇచ్చింది. కానీ గీతూ తన ఆటను రివ్యూ చేసుకోలేకపోతోంది. తనంతటి వారు లేరని..తనే తోపు కంటెంట్ అని.. తనకు మాత్రమే తెలివి ఉంది అని భ్రమలో బతికేస్తోంది.

తాజాగా బాలాదిత్య కు మండేటట్టు చేసింది. 9వ వారం కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ రసవత్తరంగా మార్చాడు. రేవంత్, శ్రీ సత్య, శ్రీహాన్,గీతూ వీరిని ఒకే బ్యాచ్ లో పడేశాడు. శారీరక బలాన్ని కాకుండా బుద్ధిబలం కూడా వాడతారని బిగ్ బాస్ ఆశిస్తున్నాడు అనే పాయింట్ ను గీతూ నొక్కి చదివింది .అంటే తనకు మాత్రమే తెలివి ఉందని మరొకసారి చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అవతల కంటెస్టెంట్ల వీక్ పాయింట్ మీద కొట్టేద్దామని మరో చెత్త సలహా ఇచ్చింది. గత వారం కూడా ఇదే పాయింట్ మీద ఆడేద్దామని అనుకొని బొక్క బోర్లా పడిందని చెప్పవచ్చు. అయినా బుద్ధిరానిగీతూ కుక్క తోక వంకర అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. ఇక బాలాదిత్యకు సిగరెట్లు లేకపోతే ఉండలేడని తెలుసు ఆ వీక్ పాయింట్ మీద కొట్టింది గీతూ..

లైటర్, సిగరెట్లు అన్ని దాచేశారు రేవంత్ ,గీతు . ఇక బాలాధిత్య ఎంతగానో వేడుకున్నాడు. కానీ ఇవ్వడానికి అంగీకరించలేదు. రెండు స్ట్రిప్స్ ఇస్తానంటే లైటర్, సిగరెట్ ఇస్తానంటూ గీతూ బేరమాడింది. ఆడితే నేరుగా ఆడి గెలవండి రా ఇలా చాలా చీప్ అని బాలాదిత్య ఆవేదన వ్యక్తం చేశాడు. గీతూ కూడా నేను చీప్ అన్నట్టుగా ప్రవర్తించింది. బాలాదిత్య మాత్రం ఏడుస్తూ అరుస్తుంటే.. గీతూ మాత్రం శునకానందం పొందింది. సైకో , సాడిస్ట్ కు ప్రతిరూపంగా నిలిచినట్టు ఉంది గీతూ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version