Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. టాప్ 3 లో వారు ఉంటారట‌!

-

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో విజయవంతంగా 77 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న‌టి సండే షో చాలా ఫ‌న్నీగా సాగింది. ఈ ఎపిసోడ్‎లో యంగ్ హీరో రాజ్ తరుణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌.. అనుభవించు రాజా టీంకు వచ్చి.. ఎంటర్ టైన్ చేసింది. రాజ్‌తరున్‌, హీరోయిన్‌, సుదర్శన్‌ పాల్గొని హౌస్లో నవ్వులు పూయించారు. తమ సినిమా ప్రమోట్‌ చేసుకున్నారు. సండే ఫన్ డేలో భాగంగా ఇంటి సభ్యులతో వివిధ రకాల గేమ్స్ ఆడించారు కింగ్ నాగ్. ఎలిమినేష‌న్లో భాగంగా.. ఇక నిన్న‌టి ఎపిసోడ్ లో ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. అంద‌రూ ఊహించ‌న‌ట్టుగానే ఆమె హౌజ్‌ నుంచి వెళ్లిపోయారు.

ఎలిమినేష‌న్ లో ఫైన‌ల్ గా.. ప్రియాంక, అనీ మాస్టర్ నిలిచారు. వీరిద్ద‌రిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి, వారికో టాస్కు ఇచ్చారు. ఇందులో స్టెప్పు వేస్తూ చివరగా ఉన్న రెడ్‌ లైన్‌ని ఎవరు ముందుగా టచ్‌ చేస్తారో వాళ్లు ఎలిమినేట్‌ అయినట్టు లెక్క. ముందుగా ఆనీ మాస్ట‌ర్ ట‌చ్ చేయ‌డంతో ఎలిమినేష‌న్ అయినట్టు నాగార్జున తేల్చేశారు. దీంతో అనీ మాస్టర్‌, ప్రియాంక, సిరి అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. రవి ముఖం వాడిపోయింది. శ్రీరామ్‌ సైతం డౌన్‌ అయిపోయాడు.

అనంత‌రం.. నాగార్జున అనీ మాస్ట‌ర్ ను స్టేజ్ మీదికి పిలిచారు. తన జర్నీని చూసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. చాలా ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా .. ఒక్కొ ఇంటి స‌భ్యుని గురించి చెప్పింది. ముందుగా రవి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషన్‌ అయ్యింది. మొదటి నుంచి తనని మోటివేట్‌ చేసేవాడని, ర‌విని చాలా మిస్‌ అవుతున్నానని ఎమోషనల్ అయింది. ఈ సీజ‌న్లో ర‌వి టాప్ 3 కంటెస్టెంట్లో ఒక‌డిగా నిలుస్తాడ‌ని జోస్యం చెప్పింది అనీ మాస్టర్‌. ఆ త‌రువాత శ్రీరామ్‌ గురించి మాట్లాడుతూ.. తనకు శ్రీ రామ్ బ్రదర్‌ లాంటివాడని, త‌న‌న్ని ఎన్నో సార్లు సపోర్ట్ చేసినట్టు తెలిపింది. ష‌న్నూ గురించి మాట్లాడుతూ.. తనతో పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పింది. కానీ ఎప్పుడూ తేడా చూడలేదని బోల్డ్ కామెంట్‌ చేసింది.

సిరి.. పటాకా అంటూ హాట్‌ కామెంట్‌ చేసింది. ఇక పింకీ బట్టర్‌ ఫ్లై లాంటిద‌ని తెలిపింది. హౌజ్‌లో జరిగిన విషయాలకు క్షమాపణలు తెలిపింది. అనంత‌రం కాజల్‌ గురించి చెప్పడానికి ఏం లేదని, సింఫుల్ గా ఆల్‌ ది బెస్ట్ చెప్పింది. మానస్ గురించి మాట్లాడుతూ.. హౌజ్‌లో ఉన్న‌న్నీ రోజులు ఫ్రెండ్‌ కాలేకపోయామని, బయట వ‌చ్చాక మంచి ఫ్రెండ్స్ అవుతాన‌నీ తెలిపింది. ఈ సీజన్‌లో ఫస్ట్ ఫ్రెండ్‌ అయిందే సన్నీనేననీ, త‌న గేమ్ చాలా బాగుంటుద‌నీ అన్నారు. సన్నీ స్పందిస్తూ అనీ మాస్టర్ ఫైట‌ర్ అనీ, బాగా ఆడిందని తెలిపారు. అనీ మాస్టర్ ఎలిమినేట్ కాగా.. హౌజ్‌లో సన్నీ, రవి, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి, కాజల్‌, ప్రియాంక, మానస్‌ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news