ఏపీ వాసులకు అలర్ట్…మళ్లీ భారీ నుండి అతిభారీ వర్షాలు…!

ఏపీలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రాయలసీమలోని పలు భారీ జిల్లాల్లో వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు సైతం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దాంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇకనిప్పటికే కుండపోత వర్షాలతో ఆందోళన చెందుతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాక మరో హెచ్చరికను చేసింది.

మళ్ళీ రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 26 నుండి డిసెంబర్ 2వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతర పురం జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.