Bigg Boss 5 Telugu: టెన్ష‌న్.. టెన్ష‌న్ .. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ఎవ‌రికి ద‌క్కేను!

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వస్తున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. 19 మందితో ప్రారంభ‌మైనా.. ఈ షోలో ప‌ది మంది హౌస్ నుంచి వెళ్లిపోగా.. 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సీజ‌న్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. కంటెస్టెంట్ల మ‌ధ్య పోటీ పెరుగుతోంది. టైటిల్ పోరులో నువ్వా? నేనా? అనే రీతిలో పోటీప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఈ వారం నామినేష‌న్ల ప‌ర్వం నుంచి ప్రారంభ‌మైనా .. హీట్ హౌస్ లో అలానే సాగుతోంది. కంటెస్టెంట్ల మ‌ధ్య హోరాహోరీ పోటీ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రో హీటెక్కించే టాస్కును బిగ్ బాస్ తెర మీదికి తెచ్చాడు. ఈ టాస్కులో గెలిచిన వారికి .. ఓ ల‌క్కీ ఛాన్స్ వ‌స్తుంది.. అదే ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్.. దీన్ని గెలుపొందడానికి.. కంటెస్టెంట్స్‌తో ‘నిప్పులే శ్వాస‌గా గుండెలో ఆశ‌గా..’ అనే టాస్కును ఆడించారు.

ఈ గేమ్ ఆడే విధానమేలా అంటే.. బ‌జ‌ర్ మోగ‌గానే.. గార్గెన్ ఏరియాలో ఉన్నా.. ఫైర్ ఇంజ‌న్ లో వెళ్లి ఇద్ద‌రూ కంటెస్టెంట్లు కూర్చోవాలి. అలాగే ముందుగా వెళ్లి కూర్చున్నా.. కంటెస్టెంట్లు వారి ఎదురుగా మంట‌ల్లో ఇద్ద‌రు కంటెస్టెంట్స్ ఫొటోలు ఉంటాయి. ఆ ఫోటోలో ఉన్నవారు.. ఇంజ‌న్‌లో కూర్చున్న కంటెస్టెంట్స్‌ల‌కు త‌మ‌ని సేవ్ చేయ‌మ‌ని.. త‌మ‌కి ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కావాల‌ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది.

ఈ ప్రోమో ప్ర‌కారం .. ఫైర్ ఇంజ‌న్లో కూర్చునే అవ‌కాశం ష‌ణ్ను, సిరి ల‌కు ద‌క్కిన‌ట్టు క‌నిపించింది. ఆ స‌మ‌యంలో వారికి ఎదురుగా ఉండే మంట‌ల్లో స‌న్నీ, ప్రియాంక ఫోటోలు ఉన్నాయి.. మొద‌ట‌గా.. స‌న్నీ వ‌చ్చి.. తాను ఎమోష‌న‌ల్ కావొచ్చు.. కానీ కంట్రోల్ చేసుకుంటున్నాన‌ని, దానికి కూడా త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూ మారుతున్నానని, త‌నకు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కావాల‌ని సిరి, ష‌న్నుల‌ను రిక్వెట్ చేశాడు.

ఆ త‌రువాత వారి ద‌గ్గ‌ర‌కు ప్రియాంక వ‌చ్చి.. త‌ను మాన‌సికంగా బ‌ల‌వంతురాలిన‌ని, నాకు అంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి.. వాటిని పుల్ పిల్ చేసుకోవాల‌న్నా.. ఇక‌పై గేమ్‌లో ముందుకు సాగాల‌న్నా..
ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కావాలంటూ బ‌తిమిలాడింది. అయితే వారెవ‌రినీ సేవ్ చేశార‌నేది స‌స్పెన్స్ గా మారింది. ఆ త‌ర్వాత ఫైర్ ఇంజ‌న్ కూర్చునే ఛాన్స్ సింగ‌ర్ శ్రీ‌రామ్, ఆనీ మాస్ట‌ర్లకు వ‌చ్చింది. వారి ఎదుట‌.. అనూష్యంగా ష‌ణ్ను, సిరి ల ఫొటోలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. వీరిద్ద‌ర‌రూ స్టైల్ చాలా డిఫిరెంట్ గా ఉంది.. త‌మ‌కు బ‌య‌ట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. మాకు ఈ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ అవ‌స‌రం లేద‌నే రీతిలో మాట్లాడారు. దీంతో శ్రీరామ్, ఆనీ మాస్ట‌ర్ లు షాక్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ ఎవ‌రు? ఎవ‌రూ ఎవిక్ష‌న్ పాన్ కైవ‌సం చేసుకుంటార‌నేది ఉత్కంఠ‌గా మారింది. అలాగే ఈ వారం నామినేష‌న్ ప‌ర్వం కూడా చాలా టెన్ష‌న్ టెన్ష‌న్ గా మారింది. ర‌వి మిన‌హా.. కాజ‌ల్‌, షణ్ను, సిరి, ప్రియాంక‌, ఆనీ మాస్ట‌ర్‌, మాన‌స్‌, స‌న్నీలు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవ‌రూ డేంజ‌ర్ జోన్లో ఉన్నా విష‌యం తెలియాలంటే.. మ‌రి కొన్ని గంట‌లు వేచి ఉండాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news