రష్యాలో కోవిడ్ భీభత్సం… కరోనా మృతులతో నిండిపోతున్న స్మశానాలు

-

ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతోంది. యూరప్ దేశాలతో పాటు రష్యాల్లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రష్యాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం రష్యాలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఆదేశంలో స్మశాన వాటికలన్నీ కరోనాతో మరణించిన వారితో నిండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37156 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆదేశంలో కరోనా కేసుల సంఖ్య 9,257,068కి చేరింది. రాష్యాలోని 85 ప్రాంతాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. గురువారం రికార్డు స్థాయిలో ఒక్కరోజే 1251 మంది మరణించారని రష్యా కొవిడ్ టాస్క్​ఫోర్స్ వెల్లడించింది. రష్యాలో ఒకరోజు సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం.

ప్రపంచంతో కోవిడ్ టీకాను మొదటిసారిగా ఉత్పత్తి చేసిన రష్యా.. ఆదేశ ప్రజలకు దాదాపుగా అందరికీ టీకాలు అందించింది. అయినా పెరుగుతున్న కేసులు ఆదేశాన్ని ఆందోళన పరుస్తున్నాయి. మరోవైపు యూరప్ దేశాలు, రష్యాలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల హెచ్చరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ దేశాల్లో 5 లక్షల కన్నా అధిక మరణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. 

 

Read more RELATED
Recommended to you

Latest news