Bigg Boss 5 Telugu: ఇదేం అరాచ‌కం రా బాబు.. ష‌న్ను కోసం చేయి కోసుకున్న‌ సిరి..

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తాజా న‌డుస్తున్నీ సీజన్ విజ‌యవంతంగా 10 వారాలు పూర్తి చేసుకొని 11 వ వారంలోకి అడుగుపెట్టింది. ప్ర‌తి వారం లాగానే ఈ వారం కూడా వాడి వేడిగా నామినేషన్ల ప‌ర్వం సాగింది. కెప్టెన్ రవి తప్ప మిగిలిన ఇంటి స‌భ్యులు నామినేష‌న్లో నిలిచారు. ఇక నామినేష‌న్ల అనంత‌రం జ‌రిగిన నిన్న‌టి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఈ ఎపిసోడ్ లో ప్ర‌ధానంగా సిరి, ష‌న్నులు సన్నీని టార్గెట్ చేశారు. సన్నీని ఎమోష‌న‌ల్ గా దెబ్బ కొట్టేందుకు వ్యూహా ప్ర‌తి వ్యూహాలు ర‌చించారు. సన్నీని అన్నయ్య అని పిలువమ‌ని, అలా పిలిస్తే.. త‌న గేమ్ ఎలా ఉంటుందో చూడాల‌ని, తిడతాడో ? లేదో ? ఏలా పడితే అలా మాట్లాడతాడో ?’ అంటూ సిరికి సలహా ఇచ్చాడు ష‌న్ను. ఈ ప్లాన్ కు సిరి కూడా ఓకే చెప్పిన‌ట్టుగా మాట్లాడింది. మొత్తానికి ఎమోషనల్‌గా..
స‌న్నీ గేమ్‌ను చెడగొట్టేందుకు రెడీ అయ్యారు.

ఇలా ఇద్ద‌రూ కాసేపు ముచ్చటించారు. ఏమైందో తెలియ‌దు. సిరిని అవైడ్ చేసేలా.. మాట్లాడాడు స‌న్నీ. దీంతో సిరి త‌ల బాదుకుంటూ బాత్రూంలో వెళ్లిపోయింది. ఆ వెంట‌నే ష‌న్ను వెళ్లి.. డోర్ ఓపెన్ చేయ‌మంటూ.. నానా హడావిడి చేశారు.ఈ ఘ‌ట‌న‌తో మిగితా ఇంటి స‌భ్యులు షాక్ గుర‌య్యారు. అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాక ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ఘ‌ట‌న‌కు ముందు ష‌న్నుకు సిరి ఓ బ్యాండ్ ఇచ్చింది. దానికి త‌న ర‌క్తంతో రాసి ఓవ‌ర్ చేసింది. వీరి మ‌ధ్య ఏమో జ‌రుగుతోందని అనుమానాలు హౌస్ లో స్టార్ట్ అయ్యాయి.

తాజాగా ష‌న్ను శ్రీ‌రామ్ తో మాట్లాడుతూ.. సిరితో ఉన్న రిలేషన్‌పై ఓపెన్ అయ్యాడు. బిగ్ బాస్ లోకి రాకముందే ష‌న్ను దీప్తి సునైనాతో, సిరి మ‌రోక‌రితో రిలేషన్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. కానీ, వీళ్లిద్ద‌రూ చాలా చ‌నువుగా.. ల‌వ‌ర్స్ లా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో షన్నూ.. శ్రీరామ చంద్రతో మాట్లాడుతూ.. సిరి మీద త‌న అభిప్రాయాన్ని చెప్ప‌కొచ్చాడు. సిరి ఒక‌రితో రిలేష‌న్‌, నేనొక‌రితో రిలేష‌న్‌లో ఉన్నాం..కానీ ఈ హౌస్‌లో వచ్చాక‌.. మేమిద్ద‌రం ఎమోష‌న‌ల్‌గా చాలా ద‌గ్గ‌ర‌య్యాం. సిరి విష‌యంలో మెంట‌ల్‌గా డిస్ట‌ర్బ్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. సిరి, జస్వంత్ పై ట్రోలింగ్ వార్ చేస్తున్నారు నెటిజ‌న్లు. వీళ్ల ఓవ‌ర్ యాక్ష‌న్ మ‌ళ్లీ స్టార్ట్ అయ్యింది. వీళ్ల రొమాన్స్ కంటే.. సన్నీ అరుపులే బెటర్రా బాబాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ బాత్రూంలు కడిగేటోళ్ల‌ను షోలోకి ఎందుకు తీసుకొచ్చార్రా అని, మ‌రికొంద‌రూ అయితే.. ష‌న్నును ఘోరంగా కామెంట్ చేస్తున్నారు. స్నానం చేస్తుండా లేదా ఈ గబ్బు నాయాలా? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో హోస్టింగ్ చేస్తున్నా కింగ్ నాగ్ ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఇలాంటి గ‌బ్బు మీద మాట్లాడావా అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news