Bigg Boss 5 Telugu: మాన‌స్ కు షాక్ ఇచ్చిన కాజ‌ల్ ! అత‌డ్ని గెలిపించేందుకే ఇంత డ్రామానా ?

Bigg Boss 5 Telugu: బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నా గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. చివ‌రి ద‌శకు చేరుకున్న కొద్దీ షో మరింత ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ.. ఈ షో ల‌వ‌ర్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ (శుక్ర‌వారం) లో బిగ్ బాస్ టాస్క్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

తాజాగా ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ టాస్క్ పెట్టి కంటెస్టెంట్ల నిప్పు రాచేశాడు. హౌస్ లో హీట్ పుట్టించాడు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లో సిరి, ప్రియాంక, ఆనీ మాస్ట‌ర్, మాన‌స్ కెప్టెన్సీ కోసం పోటీ ప‌డ్డారు. వీరికి రింగ్ ఈజ్ కింగ్‌ టాస్క్‌లో టాస్కు ఇచ్చారు . ఈ టాస్కులో మాన‌స్ గెలిచి.. కెప్టెన్ గా మారాడు. అనంత‌రం కాజ‌ల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. సారీ చెప్పి ఆమెతో గొడ‌వ‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.

అనంత‌రం మ‌రో ర‌స‌వ‌త్తరమైనా గేమ్ కు శ్రీకారం చుట్టాడు బిగ్. అందులో భాగంగా ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ప్ర‌వేశ‌పెట్టాడు. ఈ పాస్ పొంద‌డానికి ‘నిప్పులే శ్వాస‌గా.. గుండెలో ఆశ‌గా‘ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో మీ ఫొటో కాల‌కుండా చూసుకోవాలని, సైరన్ మోగిన‌ప్పుడూ ఫ‌స్ట్ ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కిన ఇద్దరూ కంటెస్టెంట్స్.. ఏకాభిప్రాయంతో ఒకరిని కాపాడాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం రాకపోతే.. ఇద్దరి ఫోటోలు కాలిపోతాయి అని బిగ్ బాస్ చెప్పారు. ఇలా .. చివ‌రి వ‌ర‌కు ఎవరి ఫొటో కాల‌కుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ ద‌క్కుతుంద‌ని ప్ర‌క‌టించాడు.


తొలి సైర‌న్ కు రవి, సన్నీలు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. వారి ఎదుట శ్రీరామచంద్ర, మానస్ ఫోటోలు
ద‌ర్శ‌మిచ్చాయి. వారిద్ద‌రూ ఏకాభిప్రాయానికి వ‌చ్చి.. శ్రీరామచంద్రను సేఫ్ చేసి.. మానస్ ఫోటోను కాల్చేశారు. ఆ ఫైర్ ఇంజ‌న్ ఎక్కే అవ‌కాశం.. మానస్ సన్నీలు వ‌చ్చింది. వారికి ఆనీ మాస్ట‌ర్, ర‌విల ఫోటోలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో వారిద్ద‌రూ ఓ అభిప్రాయానికి వ‌చ్చి.. ఆనీ మాస్టర్ సేఫ్ చేసి.. రవి ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత సిరి, షన్నులు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. వారికి సన్నీ, ప్రియాంక వ‌చ్చాయి. అందులో సన్నీని కాపాడారు.. ప్రియాంక ఫోటోను కాల్చేశారు.

త‌ర్వాత టాస్క్‌లో భాగంగా సైర‌న్ మోగగా.. ర‌వి, ష‌ణ్ముఖ్ ఫైర్ ఇంజ‌న్ ఎక్కారు. వీరికి మాన‌స్‌, శ్రీరామ్‌ ఫొటోలు వ‌చ్చాయి. ష‌న్నూ ..మాన‌స్ ని సేవ్ చేద్దామ‌ని అడగ్గా.. ర‌వి మాత్రం శ్రీరామ్‌ని సేవ్ చేద్దామ‌ని చ‌ర్చించుకున్నారు. ఫైనల్ గా మాన‌స్ ఫొటోను కాల్చేసి.. శ్రీ రామ్ ని సేవ్ చేస్తారు. ఆ త‌రువాత ఫైర్ ఇంజ‌న్ ఎక్కే అవ‌కాశం స‌న్నీ, మాన‌స్ ల‌కు ద‌క్కింది. వీరి ఎదుట ర‌వి, ఆనీ మాస్ట‌ర్ ఫొటోలు రావ‌డంతో ర‌వి ఫొటోను కాల్చేసి.. ఆనీ మాస్ట‌ర్ ను సేవ్ చేశారు.

అనంత‌రం.. ష‌ణ్ను, సిరిలు ఫైర్ ఎక్క‌గా.. వారు పింకీ, స‌న్నీ ఫోటోలు రావ‌డంతో స‌న్నీని సేవ్ చేశారు.
త‌ర్వాత ఆనీ మాస్ట‌ర్, శ్రీరామ్‌లకు ఫైర్ ఇంజ‌న్ ఎక్కే అవ‌కాశం వ‌చ్చింది. వారికి ష‌న్నూ, సిరి ల ఫోటోలు వ‌చ్చాయి. జనాల ఓటింగే నాకు ముఖ్యమ‌నీ, ఈ పాస్ తో త‌న‌కు అవ‌స‌రం లేద‌నీ అన్నారు ష‌న్నూ.
సిరి కూడ అదే త‌ర‌హాలో స్పీచ్ ఇచ్చింది. ఆడియ‌న్స్‌ స‌పోర్ట్‌తోనే ఇక్క‌డిదాకా వ‌చ్చాను, వారి డెసిష‌న్ నే ఫైన‌ల్ అని.. హౌస్ మెంట్స్ స‌హాయంతో వ‌చ్చే ఆ పాస్ త‌న‌కు అవ‌స‌రం లేద‌ని తెల్చి చెప్పింది. దీంతో హౌస్ మెట్స్ అంద‌రూ షాక్ కు గురయ్యారు. వీళ్లిద్ద‌రూ త‌మ‌కీ పాస్ అవ‌స‌రం లేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో సిరి రెచ్చిపోయింది. ఐ ల‌వ్‌యూ అంటూ ష‌న్నూను గ‌ట్టిగా హ‌త్తుకుంది. ఆ తరువాత కాజల్, ప్రియాంక లు ఫైర్ ఇంజ‌న్ ను ఎక్కి.. సిరి, శ్రీరామలోంచి సిరిని సేఫ్ చేశారు. ఆ తరువాత ఆనీ, ప్రియాంకలు ఫైర్ ఇంజన్ ఎక్కి.. సన్నీ, కాజల్‌లోంచి..సన్నీని సేఫ్ చేశారు.

ఆ తరువాత ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. ప్రియాంక‌, కాజ‌ల్ ఫైర్ ఇంజ‌న్ ఎక్కాడు. వారికి ఆనీ మాస్ట‌ర్ , సిరి ల ఫోటోలు వ‌చ్చాయి. సిరి కాపాడుదామ‌నీ ఒక‌రూ.. ఆనీ మాస్ట‌ర్ ని కాపాడుదామ‌ని ఇరువురు వాదించుకున్నారు. తొలుత సిరిని సేవ్ చేద్దామ‌ని మాట్లాడుకున్న .. కాజ‌ల్ మాట మార్చడంతో ఇద్ద‌రి ఫోటోలు కాలిపోయాయి. దీంతో హౌస్ లో ర‌చ్చ మొద‌లైంది. త‌న ఫోటో కావాల‌నే కాల్చేస్తార‌ని ఆనీ మాస్ట‌ర్ త‌న విశ్వ రూపం చూపించింది. త‌న‌కు పాస్ ద‌క్కుండా చేస్తున్నార‌ని, త‌న‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నార‌నీ రాద్ధాంతం చేసింది. తొండి ఆడుతున్నారంటూ చిర్రుబుర్రులాడింది.

కాజ‌ల్ అభిప్రాయం ప్ర‌కారం.. సిరి, ఆనీ మాస్ట‌ర్ ల ఫోటోలు కాలిపోతే.. స‌న్నీ విజేతగా నిలిస్తాడ‌ని అభిప్రాయ ప‌డింది. అందుకే మాట మార్చిన‌ట్టు తెలుస్తుంది. సోష‌ల్ మీడియా స‌మాచారం ప్ర‌కారం చివరకు సన్నీ మిగిలిపోతాడు. స‌న్నీకే ఎవిక్ష‌న్ పాస్ ద‌క్కుతుంద‌ని అంద‌రు భావిస్తున్నారు.