Bigg Boss: అత‌డే టైటిల్ విన్న‌ర్..! సన్నీ వ‌ర్సెస్ ష‌న్ను నెట్టింట్లో భారీ ఎత్తున‌ ట్రోలింగ్ ..

-

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. రోజురోజుకు షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. వారంతంలో కింగ్ నాగ్ హోస్ట్ గా వచ్చి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంట‌ర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇక నామినేష‌న్ల ప‌ర్వం గురించి ..చెప్పావ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఈ సారి నామినేష‌న్ లో ర‌చ్చ ఓ రేంజ్లోనే జ‌రిగింద‌ని చెప్పాలి. యాంకర్ రవి తప్ప మిగిలిన సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియాంక, కాజల్, మానస్, ఆనీ మాస్టర్, శ్రీరామ్ లు నామినేష‌న్ లో నిలిచారు.

ఈ క్ర‌మంలో ఎపిసోడ్ లో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స‌న్నీ వ్య‌వ‌హ‌ర శైలి చాలా విచిత్రంగా ఉంది. హౌస్ లో ఉన్నవాళ్ళను జంతువులతో పోల్చి .. నటరాజ్ మాస్టర్ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడా ? అనేలా న‌ల్ల న‌క్క‌, క‌ట్ల పాము అంటూ ష‌న్ను, సిరిలను పోల్చాడు. చాలా వింత‌గా ప్ర‌వ‌ర్తించారు.

గ‌త రెండు వారాల నుంచి స‌న్నీ వ్య‌వ‌హ‌ర శైలి ప‌రిశీలిస్తే.. న గేమ్ ఫ్లాన్ మార్చాడా? అత‌డు ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నార‌నేది ? చ‌ర్చ‌నీయంగా మారింది. సన్నీ త‌న ఆటపరంగా, వినోదపరంగా దూసుకెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో సిరి, ష‌న్నుల గొడ‌వ ఆయ‌న‌కు మ‌రింత పాపులారిటిని తెచ్చిపెట్టింది.
మ‌న మాస్ మ‌హారాజా వీజే సన్నీ.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచారు.

ఎన్నాడూ లేని విధంగా ఈ వారం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తానే సీజ‌న్ 5 టైటిల్ విన్న‌ర్ అని ట్రోల్స్ మొద‌ల‌య్యియి. గత రెండు వారాలుగా వీజే సన్నీ ట్విట్టర్‌లో భారీగా అభిమానులను కూడగట్టుకొన్నారు. ఫ‌న్ ఎలిమెంట్స్ తో బాడీ లాంగ్వేజ్ తో కంటెస్టెంట్ల‌తో పాటు కింగ్ నాగ్ కూడా ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇదిలా ఉంటే.. వీకెండ్ ఎపిసోడ్ లో స‌న్నీని టార్గెట్ చేయ‌డంతో బిగ్ బాస్ మెనేజ్మెంట్ మీద‌.. స‌న్నీ అభిమానులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కురిపించారు. భారీగా ట్రోల్ చేశారు. నాగార్జునకు సరిగా నిర్వాహకులు స్క్రిప్టు. ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదు. నాగ్ కు త‌ప్పుడు సమాచారం ఇస్తున్నారనీ, స‌న్నీ ఇమేజ్ ఎంత బ్యాడ్ చేసినా.. త‌న దూకుడు ను ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని అంటూ కామెంట్స్ చేశారు స‌న్నీ అభిమాన ఘ‌నం.

ఈ క్ర‌మంలో సన్నీని కూడా షన్ను అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అప్పడం వివాదంపై సన్నీని ట్రోల్ చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్ విజేతగా ష‌న్ను నే అని ష‌న్ను అభిమానులు ప్ర‌చారం సాగిస్తుంటే.. స‌న్నీనే ఈ సారి టైటిల్ విన్న‌ర‌ని అభిమ‌నులు కామెంట్లు వదులుతున్నారు. ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నా ఈ షో.. టైటిల్ ఎవ్వ‌రో చూడాలంటే.. ఇంకొన్ని రోజులు వేట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news