బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్ స్టేజ్ కురవడంతో రోజురోజుకు ఆసక్తిగా మారుతోంది. మరో పది రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. బిగ్‌బాస్ ఫైనల్స్‌లో మొత్తం ఐదుగురు పోటీ పడతారు. ఇప్పటికే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్‌కు వెళ్లిపోయాడు. మిగిలిన ఐదుగురు ఒకరు చివరి వారం ఎలిమినేట్ అవుతారు. మరో నలుగురు ఫైనల్ కు చేరుకుంటారు. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య బిగ్‌బాస్ ఫైనల్ జరుగుతుంది. వీరిలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారో చూడాలి.
ఇదిలా ఉంటే టాప్-5లోకి శ్రీముఖి, బాబా భాస్కర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అర్ధమవుతోంది. వాళ్ళు నామినేషన్లో ఉన్నా ఖచ్చితంగా సేవ్ అయ్యి టాప్-5లోకి వెళ్లడంలో ఎవ్వరికి ఎలాంటి డౌట్లు లేవు. బయట సోషల్ మీడియాలో నడుస్తోన్న అనేక పోల్స్‌లో కూడా వీరిద్దరికే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఇక ఫైనల్స్‌లో కూడా వీరిద్దరి మధ్యే ఎక్కువుగా పోటీ నడిచే ఛాన్సులు ఉన్నాయి.
అంతెందుకు హౌస్‌లో హౌస్‌లో ఇస్తోన్న టాస్క్‌లలో వీరు ముందే ఉంటున్నారు. ఇక తాజాగా ఇచ్చిన రంగుల టాస్క్‌లో ఒక్కో కంటెస్టెంట్ రంగు తీసుకుని ఫైనల్‌కు వెళ్లేందుకు ఎందుకు అర్హత ఉందో ? లేదో ? చెప్పి రంగు వేయాలి. ఇందులో శివజ్యోతి వరుణ్‌కు, బాబా ఆలీకి రంగు వేశారు. తర్వాత శ్రీముఖి….శివజ్యోతికి అర్హత లేదని రంగు వేసింది. అలీ మాత్రం శ్రీముఖికు టాప్-5లోకి వెళ్ళేందుకు అర్హత ఉందని రంగు వేయలేదు. అలాగే వరుణ్ కూడా…బాబాకు అర్హత ఉందని రంగు వేయలేదు.
చివరకు బిగ్‌బాస్ ఈ గేమ్‌లో ఒక్కరే విన్నర్‌గా ఉండాలని చెప్పడంతో చివరకు రాహుల్ అయిష్టంగానే బాబా భాస్కర్‌కు రంగు పోశాడు. అంటే బయటే కాకుండా లోపల హౌస్మెట్ల మధ్య కూడా ఎక్కువ మంది శ్రీముఖి, బాబా విషయంలో ఖచ్చితంగా ఫైనల్‌కు వెళతారన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురిలో వరుణ్, ఆలీ, శివజ్యోతిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళతారు ? ఎవరు ఫైనల్‌కు వెళతారో ? చూడాలి.