Bipasha Basu: గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌, బేబీ బంప్‌తో

-

మహేష్ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో మహేష్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది బిపాసా బసు. అయితే ఆ తరువాత ఈమె ఏ తెలుగు సినిమాలో ఎక్కడా కూడా నటించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో రాజ్ జిస్మ్, ధూమ్-2, రేస్ వంటి చిత్రాలలో నటించింది.

అయితే ఈమె కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమయింది.అయితే తాజాగా తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బస్సు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్తదశ జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015 లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’ లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news