‘జార్జిరెడ్డి’ సినిమాకు ఆ ఎమ్మెల్యే వార్నింగ్‌..

జార్జిరెడ్డి’ సినిమా ఈ నెల 22 న రిలీజవుతుంది. సందీప్ మాధవ్ ఈ సినిమాలో ‘జార్జిరెడ్డి’ గా నటించాడు. 1968 – 70 లో బాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ లో జార్జిరెడ్డి లైఫ్ లోని కొన్ని కీలక అంశాలను తెరకెక్కించారు మేకర్స్. జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. జార్జిరెడ్డి సినిమాపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే సినిమాలో తమ సంఘాలను కించపరిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. సినిమా ముసుగులో తమ సంఘాలపై ఆరోపణలు చేయకూడదన్నారు. అలా చేస్తే అడ్డుకుంటామని చెప్పారు.

సినిమాలో నిజానిజాలు మాత్రమే చూపెట్టాలన్నారు. జార్జిరెడ్డి హత్య సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తు చేశారు. ఏబీవీపీ నాయకులపై దాడులకు సూత్రదారి జార్జిరెడ్డేనని ఆరోపించారు. ప్రగతిశీల భావాలు కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.