బాంబులు తొలగిస్తున్న మహిళలు… పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి…!

9 ఏళ్ళ చిన్నారి సరదాగా ఆడుకుంటుంది… తన స్నేహితులతో హుషారు హుషారుగా ఉంది… ఇంతలో విస్ఫోటనం… ఆ పేలుడులో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోగా… ఇద్దరు చిన్నారులకు కాళ్ళు తెగిపడ్డాయి… ఈ ఘటన ఇంకా మరువనే లేదు అక్కడి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో మరో ల్యాండ్ మైన్ పేలింది. ఈ పేలుడులో ఒక మహిళ తన రెండు కాళ్ళు పోగొట్టుకుంది… ఇలా ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏదొక విస్ఫోటనమే. ఆఫ్ఘనిస్తాన్ లోని బామియన్ ప్రావిన్స్ ఒకప్పుడు సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ముందు వరుసలోఉండేది.

దీనితో అక్కడ భారీగా ల్యాండ్ మైన్ లను అమర్చే వారు… ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి గాను… సైనికులు, ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడే వారు. ఆ తర్వాత క్రమంగా యుద్ధం ముగిసింది గాని వాటిని మాత్రం తొలగించలేదు. దీనితో ఇప్పుడు అక్కడి మహిళలు రంగంలోకి దిగారు. ఆ బాంబులను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ… బాంబులను నిర్వీర్యం చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం… అక్కడి సైన్యం సహకారంతో… పిల్లలు ఉన్న తల్లులు,

నిరుద్యోగులు గా ఉన్న మహిళలు… రంగంలోకి ఆ బాంబులను తొలగిస్తున్నారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్న క్లస్టర్ బాంబులను… మహిళలే స్వయంగా వెళ్లి తీస్తున్నారు. ఇక ఉద్యోగులు గా ఉన్న మహిళలు కూడా రోజులో రెండు గంటల పాటు ఆ బాంబులను గుర్తించే బాధ్యతను తీసుకుని మరో బృందానికి అప్పగిస్తూ ఉంటారు. అనంతరం రంగంలోకి దిగే మహిళా బృందం, ప్రత్యేక పరికరాలతో వాటిని వెలికి తీస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు గత ఆరు నెలల కాలంలో 21 వేలకు పైగా ల్యాండ్ మైన్ లను వాళ్ళు తొలగించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో 70 శాతం బాంబులను వాళ్ళు తొలగించినట్లు అయింది.