సుశాంత్‌పై నెట్టేస్తున్నారా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌రువాత వెలుగులోకి వ‌చ్చిన  డ్రగ్స్ కేసులో అత‌ని పేరు ప్ర‌ధ‌మంగా వినిపించిన విష‌యం తెలిసిందే. మాదకద్రవ్యాల కుంభకోణంలో అతన్ని పావుని చేశారంటూ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ మొద‌లైంది. సుశాంత్ మృతి త‌రువాతే బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వాకంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ స్టార్ట‌యింది.

అయితే ఈ కేసులో రియా దొరికి పోవ‌డంతో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. గ‌త రెండు రోజులుగా ఈ కేసులో సానా అలీఖాన్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌ల‌ని నార్కోటిక్ డ్ర‌గ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఈ విచార‌ణ‌లో అనూహ్యంగా సుశాంత్ పేరు తెర‌పైకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజా విషయం ఏమిటంటే, సుశాంత్‌తో కలిసి పనిచేసిన శ్రద్ధా మరియు సారా ఇద్దరూ సుశాంత్ తన చిత్రాల షూట్ విరామ సమయంలో చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవడం చూసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇది షాకింగ్ విష‌యంగా తెలుస్తోంది. ఆర‌నున్న రోజుల్లో ఇది సుశాంత్ కేసుని ప‌క్క‌దారి ప‌ట్టించేదిగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.