కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా సడలిస్తోంది. అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపరీక్షలపై దృష్టి సారించారు. ఈ మేరకు ప్రభుత్వాలు విద్యాసంవత్సరం ప్రారంభంపై ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1న డిగ్రీ, పీజీ కాలేజీలు ప్రారంభించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ముఖ్యమైన పండుగులు నవంబర్ నెలలో ముగుస్తుండటంతో అకాడమిక్ ఇయర్‌ను డిసెంబర్‌లో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ ప్రకటించారు. ఈ అంశంపై ఆయన ఇప్పటికకే యూనివర్సిటీల వైస్‌చాన్సర్లతో సమావేశమై చర్చించారు.
నవంబర్ నెలలో వరుసగా లక్ష్మీ పూజ, కాళీ పూజ, దీపావళి, ఛాట్ పూజ, జగద్ధాత్రి పూజ వంటి పండుగలు ఉన్నాయి. అందువల్ల 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ, యూజీ కాలేజీలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. విద్యార్థుల కోర్సుకు సంబంధించి మెటీరియల్‌ను కూడా అందిస్తున్నాయన్నారు. అయితే ఆన్‌లైన్ సౌకర్యం లేనివారు బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వారికి ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ వెల్లడించారు.