ఆ పని పూర్తికాగానే సాయంత్రం తన ఫామ్ హౌస్ లోనే రెండు గంటలు ఎక్సరసైజ్ చేస్తాడుట. ఏ రోజు షూటింగ్ లేకపోయినా…మరేదైనా కారణం చేత ఖాళీగా ఉన్న ఆయన చేసే పనులివేనని ఓ ఇంటర్వూలో సల్మాన్ తెలిపాడు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. వందల కోట్లు సంపాదన. సినిమాలు గాక సొంత వ్యాపారాలెన్నో. బ్రాండ్ అంబాసిడర్ గాను పనిచేస్తూ కోట్ల రూపాయాలు ఆర్జిస్తున్నాడు. మరి అంతటి దిగ్గజం ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు? షూటింగ్ లేకపోతే ఆయన దినచర్య ఏంటి? అంటే కొన్ని ఆసక్తికర విషయాలు లీకయ్యాయి. భాయ్ ఖాళీగా ఉంటే ట్రాక్టెర్ ఎక్కి పొలం దున్నుతాడుట. తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో కూలీలతో కలిసి చేయి కలుపుతాడుట. మట్టి పిసుకుతాడుట. వరి నాట్లు వేస్తాడట.తన స్టాప్ తో చాలా సింపుల్ గా హడావుడి లేకుండా గడుపుతాడుట. వాళ్లతో కలిసి భోజనం చేస్తాడుట.
ఆ పని పూర్తికాగానే సాయంత్రం తన ఫామ్ హౌస్ లోనే రెండు గంటలు ఎక్సరసైజ్ చేస్తాడుట. ఏ రోజు షూటింగ్ లేకపోయినా…మరేదైనా కారణం చేత ఖాళీగా ఉన్న ఆయన చేసే పనులివేనని ఓ ఇంటర్వూలో సల్మాన్ తెలిపాడు. ముంబై- పుణే హైవే దారిలో సల్మాన్ కి 250 ఎకరాలు పొలం ఉందిట. అక్కడే ఈ పనులన్నీ చేస్తాడుట. సల్మాన్ కు షూటింగ్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే. అక్కడే గన్ షూట్ కు సంబంధించిన సరంజమా మొత్తం రెడీగా ఉంటుందట. ఫామ్ హౌస్ కు వెళ్లినప్పుడల్లా రెండు గంటలు షూటింగ్ కు కేటాయిస్తాడుట. జంతువులను వేటాడం సల్మాన్ కు ఓ హాబీ. దగ్గరలో గల అడవిలో జాతీయ జంతువు, పక్షి కాకుండా చిన్న చిన్న జంతువులను వేటాడి.. విందు బోజనం ఆరగిస్తాడుట.
ముంబై సిటీలో ఉంటే కనీసం నెలకి రెండుసార్లు అయినా ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని దగ్గరుండి పర్యవేక్షి స్తాడుట. ఇక సల్మాన్ సింపిల్ సిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు హీరోల్లా బిల్డప్ లు కొట్టడు. అతి చేయడు. సేవాదృక్ఫదం గల వాడు. ఎంతో మంది అనాదలను చేరదీసాడు. స్వచ్ఛంద సంస్థలు, అనాధశరణాలయాలను సొంత ఖర్చు తో నడుపుతున్నాడు. సహాయం అంటూ వచ్చిన సేవాస్థలకు అండగా నిలబడుతున్నాడు. ఏటా ట్యాక్స్ ల రూపంలో మహరాష్ర్ట ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నాడు.