2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు పోటీ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఆమె చండీగఢ్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ తరఫున ఆమె రంగంలోకి దిగనున్నట్లు వస్తున్న వార్తలపై కంగనా తాజాగా స్పందించింది. ఓ వార్తా సంస్థ రాసిన ఆర్టికల్ స్క్రీన్ షాట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలు చూసి స్నేహితులు, బంధువులు అడుగుతున్నారని అన్నారు. అయితే ఇదంతా నిజం కాదని కంగన స్పష్టం చేసింది.
మరోవైపు చండీగఢ్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా భార్య పరిణీతి చోప్రాను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలు చూసిన నెటిజన్లు చండీగఢ్ లోక్‌సభ స్థానంలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు పోటీ పడనున్నారని కామెంట్లు చేస్తున్నారు