బ్రేకింగ్ న్యూస్ : సల్మాన్ హెల్త్ కండీషన్ సీరియస్.. ఆందోళనలో అభిమానులు..!

-

బాలీవుడ్ కండల వీరులు సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ తాజాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆయన గత కొన్ని రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నాడు. బిగ్ బాస్ 16వ సీజన్ కు హోస్టుగా చేస్తున్న సల్మాన్ ఖాన్ ఆ బాధ్యతలను కరణ్ జోహార్ కు అప్పగించారు. ఇందుకు సంబంధించిన విషయాలను బిగ్ బాస్ టీం అఫీషియల్ గా వివరించింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ హెల్త్ కండిషన్ ప్రస్తుతం అస్సలు బాగాలేదు.

ఆయనకు డెంగ్యూ వ్యాధి రావడంతో చాలా డల్ అయిపోయాడని తెలుస్తోంది. అంతేకాదు శరీరంలో ప్లేట్లెట్స్ కూడా బాగా పడిపోయాయి. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయాలను బయటకు రాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. పైగా ఆయన హెల్త్ కండిషన్ కాస్త సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే సల్మాన్ ఖాన్ ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. ఇక దీంతో సెలబ్రిటీలు సైతం సల్మాన్ ఖాన్ త్వరలోనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే డెంగ్యూ ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది. వర్షాలు విజృంభిస్తున్న వేళ రోగాలు కూడా అంతే రీతిలో ప్రజలపై దాడి చేస్తున్నాయి . కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇక ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ కూడా త్వరలోనే కోలుకోవాలని ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు, అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news