హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ నేడు ( గురువారం) కన్నుమూశారు.అనారోగ్యం బారినపడినన శ్యామ్ సిద్ధార్థ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.నేడు పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు.తండ్రి మరణంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇక శ్యామ్ సిద్ధార్థ్ మరణ వార్త తెలుసుకున్న పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
ఆయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.శ్యాం సిద్ధార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. కాగా 2007 లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యారు నిఖిల్. నిఖిల్ తండ్రి పేరు శ్యామ్ సిద్ధార్థ, తల్లి వీనా సిద్ధార్థ, శ్యామ్ సిద్ధార్థ కి ఇద్దరు కుమారులు (నిఖిల్, రోహిత్) ఒక కూతురు ( సోనాలి) ఉన్నారు.