BRO : ‘బ్రో’ సినిమా టీజర్ కు ముహుర్తం ఫిక్స్

-

BRO : ‘బ్రో’ సినిమా టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పవన్, సాయిధరమ్​ల లుక్​ను ఈ చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో మామాఅల్లుళ్లు సూపర్ హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్​ లుక్ అదిరిపోయింది.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 28న రిలీజ్​కు రెడీ అవుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవర్ స్టార్ స్వాగ్ సూపర్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే…తాజాగా BRO : ‘బ్రో’ సినిమా టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమా టీజర్‌ త్వరలోనే అనౌన్స్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news