70 ఏళ్లు ఉన్న కేసీఆర్‌..మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు – కేటీఆర్

-

మంత్రి కేటీఆర్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను తిట్టి పైచాకిక ఆనందాన్ని పొందుతున్నారని..ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ వయస్సు 70 ఏళ్ళు. ఆయన ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని..మరోసారి సీఎం అవుతారన్నారు కేటీఆర్‌. నడ్డా కానీ, తీన్ ఫుట్ గాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదని.. 55 ఏళ్లలో చేయలేని పని బిఆర్ఎస్ తొమ్మిదేళ్లలో చేసిందని వెల్లడించారు.

ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని.. కేసీఆర్ – బీజేపీ, కేసీఆర్ – కాంగ్రెస్ తో కలిసిపోయారని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధి గురించి మాట్లాడాలని తెలిపారు. 55 ఏళ్లలో కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఏమి చేసింది? అమరవీరుల ను చంపింది ఎవరు? సోనియాగాంధీ వల్లే కదా పొరగాళ్ళు చనిపోయిందని చెప్పారు. చంపినోడే సంతాప సభ పెట్టినట్లు రేవంత్ మాటలు ఉన్నాయని.. అవినీతి గురించి రేవంత్ చెప్పడం హాస్యాస్పదం. 50 లక్షల తో దొరికిన దొంగ రేవంత్ అన్నారు. ఢిల్లీ గులాములతో ఏమి కాదని తెలిపారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news