BRO : బ్రో సినిమా నుంచి క్రేజీ అప్డేట్

-

తమిళ దర్శకుడు సముద్రఖని నటుడిగా దర్శకుడిగా పరిణితి చెందన్న విషయం తెలిసిందే. ఈయన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ముల్టీస్టారర్ గా తీస్తున్న చిత్రం “BRO”… ఈ టైటిల్ ను ఈ మధ్యనే చిత్ర బృందం ప్రకటించి ఫ్యాన్స్ కు హుషారును తెచ్చింది. కాగా ఈ సినిమా జులై వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ పోస్టర్లను వేరువేరుగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఉన్న పోస్టర్ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రేపు ఉదయం 10:08 కు ఈ పోస్టులను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news