ఓటీటీలోకి ‘బబుల్‌గమ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

యాంకర్ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన సినిమా ‘బబుల్‌గమ్‌’. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్‌ మూవీ గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై యూత్ ని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు రెడీ అయింది.

థియేటర్లో విడుదలైన 40 రోజుల తర్వాత బబుల్ గమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుంచి బబుల్ గమ్ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది. ఈ వివరాలు వెల్లడిస్తూ ఆహా పోస్టర్‌ విడుదల చేసింది. రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదిగా నటించి అలరించాడు రోషన్‌. తన ప్రేయసి జాహ్నవి పాత్రలో మానస చౌదరి ఆకట్టుకుంది. చైతూ జొన్నలగడ్డ, హర్ష, అను హాసన్‌, కిరణ్‌ మచ్చా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news