విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మించారు. ఆగష్టు 15న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ విపరీతంగా ఉంది. టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేయగా.. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ మేనియా కొనసాగుతాడని అంటున్నారు.
ఇక ఈ సినిమా బడ్జెట్ 14 కోట్ల దాకా పెట్టారట. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ కలిపి 5 కోట్ల దాకా వచ్చాయట. అంటే సినిమా హిట్ అవ్వాలంటే మరో 9 కోట్లు రాబట్టాలి. గీతా ఆర్ట్స్ ఓన్ గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారట.
నైజాంలోనే సగానికి పైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉండగా మిగిలిన ఏరియాలన్ని కలిపి గీతా గోవిందం తప్పకుండా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి విజయ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలంటే మరో 4 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.