రండి.. 29 రాష్ట్రాల పేర్లను 29 సెకన్లలో నేర్చుకుందాం..!

-

మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా. కాని.. 29 రాష్ట్రాల పేర్లు టకటకా చెప్పండి ఓసారి అంటే మాత్రం మీరు గుక్కతిప్పుకోవడం ఖాయం. సరే.. అటూ ఇటూ ఓ ఐదు పది నిమిషాల సమయం తీసుకొని ఎలాగోలా పేర్లు చెబుతారు. కాని.. ఓ టీచర్ మాత్రం 29 రాష్ట్రాల పేర్లను గుక్క తిప్పుకోకుండా కేవలం 29 సెకన్లలోనే చెప్పేయగలడు. నమ్మకం లేదా.. అరె.. మేం చెప్పేది వినండి.. అరె.. నవ్వుతారంటి అలా. మీరు ఇక వినరు. మీకు ఆ వీడియో చూపిస్తేనే నమ్ముతారు. ముందు ఆ వీడియో చూడండి.. తర్వాత మనం మాట్లాడుకుందాం.

చూశారు కదా వీడియో.. ఎలా ఉంది. దిమ్మతిరిగిపోయింది కదా. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ఓ టీచర్ ఈ ట్రిక్ నేర్పిస్తుండగా తీసిన వీడియో ఇది. ఎలా ఉంది ట్రిక్. మస్తుగుంది కదా. ఇక.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి ఆ టీచర్ ను తెగ మెచ్చుకుంటున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్న ఆ టీచర్ ను తెగ పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news