“మా’ సభ్యులకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తామంటున్న ప్రెసిడెంట్లు

-

మా- లో విభేదాలన్ని టీకప్పులో తుఫాను లాంటివేనని మా ఏపీ వ్యవస్థాపకుడు,సినీ దర్శకుడు దిలీప్ రాజా,కవితలు  వ్యాఖ్యానించారు.అంతా ఒకే కుటుంబ సభ్యులని వాయుగుండం కన్నా వేగంగా వివాదాలు విభేదాలు తుడిచిపెట్టుకు పోతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.దీన్ని అలుసుగా తీసుకుని వేరేవారైన తక్కువచూపు చూసి విమర్శిస్తే మూకుమ్మడిగా మేమంతా కలిసి ప్రతిఘటిస్తామని దిలీప్ రాజా చెప్పారు.

రాష్ట్రం రెండుగా విడిపోయాక‌ విభజన చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలు మేరకు మా-ఏపీ 24 విభాగాల యూనియన్ సంబంధిత శాఖ అధికారులనుండి ఆమోదం పొందినాకె ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మా ఏపీ కి అనుమతి మంజూరు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.వివిధ శాఖలకు సామ్ అందించిన సాంకేతిక నిపుణులు,నటీనటులు ఇప్పటికే 400 మంది సభ్యులు ఉన్నట్లు ఆయన వివరించారు.సినీనటి కవిత అధ్యక్షురాలిగానుప్రధాన కార్యదర్శిగా నరసింహ రాజు,పరిపాలన కార్యదర్శిగా అన్నపూర్ణ,కార్యక్రమాల కార్యదర్శిగా గీతాంజలి,జాయింట్ సెక్రటరీగా హాస్యనటి శ్రీలక్ష్మి, ట్రెజరర్ గా ఆలూరి సుందర్రామయ్య, నిర్వహణకమిటీ చైర్మిన్  బి.వీరబాబు ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా శుభలేఖ సుధాకర్, జయాశీల,ఆషా, ప్రదీప్ దోనెపూడి మరో 8 మంది పనిచేస్తున్నట్లు దిలీప్ రాజా చెప్పారు.

కాగా  తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే న్యాయనిర్ణేతలుగా మా- ఏపీ సినీ అవార్డుల వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరిలో నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.ఇందులో ఉత్తమ హీరో, హీరోయిన్, కేరెక్టరు నటుడు,నటి,ప్రతినాయకుడు,హాస్య నటి,హాస్య నటుడు,ఉత్తమ దర్శకుడు,నిర్మాత,డివోపి,మేకప్, ఎడిటర్,కాస్ట్యూమ్స్,ఆర్ట్ తదితర స్ఖలతోపాటుగా నూతనంగా వెండి తెరకు పరిచయమైన ప్రతిభావంతులకు మా ఏపీ సత్కరించనుందన్నారు.హెల్త్ కార్డుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మంజూరు చేసేలా కృషి వహిస్తున్నట్టుకుగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version