వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసు: సునీత

-

తన తండ్రి వివేకా హత్య కేసు గురించి సీఎం జగన్​కు ముందే తెలిసిందని సునీతా రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై ఆమె ఇటీవల సుప్రీంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్​పై ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

‘‘సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆయన హాజరుకాలేదు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారు. సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తూ.. ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారు. అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది. సీబీఐ అధికారులపై అవినాష్‌ తప్పుడు ఫిర్యాదులు చేశారు.. వారిపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారు. ’’ అని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news