ఆడవాళ్లంటే ఇష్టం లేదా? అని దర్శకుడిపై సీరియస్.. పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’కు కష్టాలివే..!

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందరు హీరోల మాదిగిగా కాకుండా కొంచెం డిఫరెంట్ మూవీస్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఆయన నటించిన ‘తొలి ప్రేమ’ చిత్రం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. కానీ, ఈ సినిమాకూ విడుదల సందర్భంగా కష్టాలు ఎదురయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

 

పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ‘తొలి ప్రేమ’ నిలిచింది. అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ తో పాటు సెన్సిబుల్ లవ్ స్టోరిని చక్కటి పాటలతో సినిమాను దర్శకుడు కరుణాకర్ చక్కగా తెరకెక్కించారు. దేవా అందించిన మ్యూజిక్ ఫిల్మ్ కు హైలైట్ గా నిలిచింది. యూత్ అంతా అప్పట్లో ఈ పిక్చర్ చూసి ఫిదా అయిపోయింది.

హీరోయిన్ గా కీర్తిరెడ్డి నటించింది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా ఆడింది. కాగా, ఈ సినిమా విడుదల సందర్భంగా బయ్యర్లు ఎవరూ కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడలేదని ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అసలు ఒక్క ఫిమేల్ వాయిస్ సాంగ్ కూడా ఇందులో లేదని, ఒకరు దర్శకుడిపైన సీరియస్ అయ్యారని చెప్పారు.

చిత్రం గురించి బయ్యర్లు అలా చెప్పినప్పటికీ పవన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలిపారు. అలా ఆ చిత్రం ఊహించినట్లుగానే ఘన విజయం సాధించిందని ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్ గుర్తు చేసుకున్నారు. పవన్ కల్యాణ్-కరుణాకర్ కాంబోలో వచ్చిన ఈ పిక్చర్ అప్పట్లో యూత్ అందరికీ ఫేవరెట్ ఫిల్మ్ అయిపోయింది. అలీ, పవన్ కల్యాణ్ మధ్య సంభాషణలతో పాటు లవ్ సీన్స్, కామెడీ ఎలిమెంట్స్, నేచురల్ ఫైట్స్ అన్నీ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version