బిగ్ బ్రేకింగ్: ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత.. సీఎం కేసిఆర్ సంచలన నిర్ణయం..!!

-

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనా బారిన పడిన పేషెంట్ ల విషయం లో చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేనంతగా ఏకంగా 11 మంది కరోనా పేషెంట్ లు  డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

 

ఈ నేపధ్యం లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని గాడిలో పెట్టడం కోసం కే‌సి‌ఆర్ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు వారం రోజులు గా రాష్ట్రం లో, దేశం లో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము.

 

 

లాక్ డౌన్ , కర్ఫ్యూ ఇలా అన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ధిక విషయం లో కూడా కంగారుగా ఉన్నాయి. Telangana will help students from Andhra Pradesh and techies ...దేశం యావత్తూ రాష్ట్రాలు అన్నీ ఒకటో తారీఖు వస్తోంది అంటే ఎలా డీల్ చెయ్యాలి అని సతమతం అవుతున్న తరుణం లో, కే‌సి‌ఆర్ దేశానికి మార్గం చూపించినట్టుగా అయ్యింది .. తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగు వేసింది.

 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పైన క్షుణ్ణంగా గ్రిప్ ఉన్న ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ దీనిమీద ఉన్నత స్థాయి లో సమీక్ష చేశారు . కరోనా కారణంగా కొన్ని వేతనాల చెల్లింపులలో కోతలు తప్పవు అని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.

 

ఇటువంటి తరుణంలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించారు. ముఖ్యమంత్రి , మినిస్టర్ లు , ఎమ్మెల్యే లు మొదలైన ప్రజా ప్రతినిధుల జీతాల్లో 75 % కోత విధించారు .. రాష్ట్ర కార్పరేషన్ ఛైర్మన్ లు మొదలైన వారి జీతాల్లో 75 % కోత విధించారు .. అఖిల భారత సర్వీస్ లో పని చేసే వారి జీతాల్లో 60% కోత విధించారు. మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కోత విధించారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ గట్టిగా తగలకుండా కెసిఆర్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఈ తరుణం లో రాష్ట్రం ఆర్ధికంగా కూడా వెనక పడిపోకుండా మరిన్ని జాగ్రత్తలు , సంచలన నిర్ణయాలు తీస్కోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news