ఆ సినిమాలు చూస్తే రూ.73 వేలు మీ ఖాతాలోకి!

-

మీకు ఇంగ్లిష్‌ సినిమాల హిరో జేమ్స్‌ బాండ్‌ తెలుసా? ఆయన తెలియని వారు ఎవరుంటారులే! అయితే మీరు ఆ హిరో సినిమాలు ఇష్టమైతే మీకు బంపర్‌ ఆఫర్‌. ఆయన సినిమాలను చూసిన వారికి రూ.73 వేలు మీ ఖాతాలోకి వచ్చి పడతాయి. సాధారణంగా మనం సినిమాలను చూడటానికి డబ్బు చెల్లిస్తాం అంటోంది. బహుశా అవేవో చెత్త సినిమాలు అనుకుంటే పొరపాటే!, అద్భుతండా ఉండే జేమ్స్‌ బాండ్‌ సినిమాలు. అయితే, రెండు లేదా మూడు సినిమాలు చూస్తే డబ్బులు వచ్చేస్తాయమని మాత్రం అనుకోవద్దు. ‘జేమ్స్‌ బాండ్‌’ సినిమా మొదటి పార్టు నుంచి ఇప్పటివరకు విడుదలైన 24 సినిమాలు వరుసగా చూసేయాలి.

ఇది Nerdbear.com అనే వెబ్‌సైట్‌ ఈ ఆఫర్‌ ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న జేమ్స్‌ బాండ్‌ సీరిస్‌లో 25వ సినిమా.. ‘No Time to Die’ విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాలి. కరోనా నేపథ్యంలో సెప్టెంబరుకు వాయిదా పడింది.
జేమ్స్‌ బాండ్‌ సీరిస్‌లను చూసేందుకు ఎంపికయ్యే అభ్యర్థి ఆ మూవీ విడుదలకు ముందే ఆ 24 చిత్రాలు చూసేయాలి.

ఆ సినిమాల ఏమిటంటే..

  1. Dr. No (1962)
  2. From Russia with Love (1963)
  3. Goldfinger (1964)
  4. Thunderball (1965)
  5. You Only Live Twice (1967)
  6. On Her Majesty’s Secret Service (1969)
  7. Diamonds Are Forever (1971)
  8. Live and Let Die (1973)
  9. The Man with the Golden Gun (1974)
  10. The Spy Who Loved Me (1977)
  11. Moonraker (1979)
  12. For Your Eyes Only (1981)
  13. Octopussy (1983)
  14. A View to a Kill (1985)
  15. The Living Daylights (1987)
  16. Licence to Kill (1989)
  17. GoldenEye (1995)
  18. Tomorrow Never Dies (1997)
  19. The World Is Not Enough (1999)
  20. Die Another Day (2002)
  21. Casino Royale (2006)
  22. Quantum of Solace (2008)
  23. Skyfall (2012)
  24. Spectre (2015).

సినిమాలు చూసిన వ్యక్తికి నిర్వాహకులు అతడికి 1000 డాలర్లు (సుమారు రూ.73 వేలు), సినిమాలు చూసేందుకు 100 డాలర్ల అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డు, త్వరలో విడుదలయ్యే తాజా జేమ్స్‌ బాండ్‌ సినిమా చూసేందుకు 50 డాలర్ల ఏఎంసీ గిఫ్ట్‌ కార్డు ఇవ్వనున్నారు.అయితే ఇంకెందుకు లేటు. జేమ్స్‌ బాండ్‌ సినిమాలంటే ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. దీనికి ఎంపికయ్యే అభ్యర్థి 30 రోజుల్లోనే 24 సినిమాలను చూసేయాలి. ఈ సినిమాలన్నీ కలిపితే మొత్తం నిడివి 51 గంటలు.

Read more RELATED
Recommended to you

Latest news