బ్రేకింగ్ : థియేటర్స్ ఓపెనింగ్ కోసం కేంద్రం కీలక సమావేశం

-

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్‌ తో సినీ ఇండస్ట్రీ అంతా మూత బడిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, సీరియల్స్ షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడా మొదలు కాలేదు. ప్రస్తుతం అన్ లాక్ 4.0 మొదలయింది. అయితే దాదాపు అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చినా కేవలం థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ కి మాత్రం ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు థియేటర్స్ ఓపెనింగ్ వైపుగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ లోని సినిమా హాల్స్ ప్రారంభం అయ్యే విషయం మీద ఈ నెల 8న సమావేశం జరగనుంది. మల్టీప్లెక్స్ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్టు చెబుతున్నారు. థియేటర్స్ ఓపెన్ చేయాలి, ఒక వేళ చేస్తే కనుక సాధ్యాసాధ్యాలు ఏమిటి అనే విషయాల మీద చర్చించనున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news