శంక‌ర్ స‌క్సెస్ తో ఛార్మీ పెళ్లి ధూమ్ ధామ్..!

-

ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ అయిన అనంత‌రం చార్మీ పెళ్లి చేసుకోవాల‌నుకుంటోందిట‌. ఆ సినిమా స‌క్సెస్ అయితే మ‌రింత ధూమ్ ధామ్ గా ప‌రిణ‌యం ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ పై ఛార్మీ పెళ్లి ఆధార‌ప‌డి ఉందా? స‌క్సెస్ కొడితే ఛార్మీ ఓ ఇంటిద‌వుతుందా? అంటే అవున‌నే స‌మాచారం పూరి కేవ్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఛార్మీ కొన్నేళ్ల‌గా పూరి జ‌గ‌న్నాత్ తో క‌లిసి సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ గా ఫేడౌట్ అయిన అనంత‌రం అమ్మ‌డు పూరి పంచ‌న చేరింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పూరి బెస్ట్ ఫ్రెండ్ కావ‌డంతోనే అత‌నితో భాగ‌స్వామి అయింది.

ఈ ప్రోస‌స్ లో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని రూమ‌ర్లు వినిపించాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. అప్పుడ‌ప్పుడు వాటిని ఖండించినా, స్పెక్యులేష‌న్స్ మాత్రం ష‌రా మామూలుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ద్వ‌యం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంక‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈనెల 18న సినిమా విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి స‌క్సెస్ అయితే ఛార్మీ పెళ్లి చేసుకుంటుంద‌ని పూరి కేవ్ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. విన‌డానికి కాస్త సిల్లీగా ఉన్నా అదే నిజ‌మ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఛార్మీ ఇంట్లో పెళ్లి చేసుకోమ‌ని తీవ్ర‌మైన ఒత్తిడి ఉంది. న‌టిగా త‌ప్పుకున్న త‌ర్వాత పూరితో సాన్నిహిత్యం కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు.

అయినా వాళ్ల‌ను ఆవిష‌యంలో విబేధించి త‌న ప‌నే తాను చూసుకుంటోంది. అయితే పెళ్లి బాధ్య‌త‌లు మాత్రం పెద్ద‌ల‌కే అప్ప‌గించింది. వాళ్లు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాన‌ని ఓ సంద‌ర్భంలో అంది. ఇప్పుడా మాట‌ను నిల‌బెట్టుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ అయిన అనంత‌రం పెళ్లి చేసుకోవాల‌నుకుంటోందిట‌. ఆ సినిమా స‌క్సెస్ అయితే మ‌రింత ధూమ్ ధామ్ గా ప‌రిణ‌యం ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రీ ఈ వార్త‌లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. రిలీజ్ కు ఇంకా 13 రోజులే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి డే అండ్ నైట్ ప్ర‌చారానికి సంబంధించిన ప‌నుల్లోనే టీమ్ అంతా నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version