RRR హిందీ రీమేక్.. ఏ పాత్రకు ఎవరు సూట్ అవుతారో చెప్పిన చాట్ జీపీటీ

-

ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాన్ వరల్డ్ ఇమేజ్ దక్కించుకున్న చిత్రం. ఈ సినిమాకు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. చివరకు ఆస్కార్ పురస్కారాన్ని కూడా గెలిచింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్​లో రీమేక్ చేస్తే.. అందులో ఏ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటారు. ఇదే ప్రశ్నను చాట్ జీపీటీని అడిగితే అదేం చెప్పిందో తెలుసా..?

అల్లూరి పాత్రలో ఒదిగిపోయిన రామ్ చరణ్ పాత్రలో బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్​వీర సింగ్ కానీ.. హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్ మల్హోత్రా కానీ బాగుంటారని చాట్ జీపీటీ చెప్పింది. ఇక కొమురం భీమ్​గా జూనియర్ ఎన్టీఆర్ పలికించిన హావభావాలు.. పండించిన ఎమోషన్​ను ఆ రేంజ్​లో నటించాలంటే కాస్త కష్టమే. కానీ ఈ పాత్రకు బీ టౌన్​లో విక్కీ కౌశల్, రాజ్ కుమార్ రావు బాగుంటారని చెప్పింది చాట్ జీపీటీ.

ఇక సీత పాత్రలో నటించిన ఆలియా భట్ స్థానంలో హిందీ వెర్షన్​కు శ్రద్ధా కపూర్, కృతి సనన్.. అజయ్‌ దేవ్‌గణ్‌ స్థానంలో సంజయ్‌ దత్‌ లేదా అనిల్‌ కపూర్‌ ; శ్రియ స్థానంలో దీపికా పదుకొణె పేర్లను వినిపించింది చాట్‌జీపీటీ. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను హిందీలో రీమేక్‌ చేసే సత్తా ఎవరికి ఉందని అడిగితే సంజయ్ లీలా భన్సాలీ పేరు చెప్పింది చాట్ జీపీటీ.

Read more RELATED
Recommended to you

Latest news