నిన్న ఉదయం పోలీసులపై దాడి చేసిన కారణంగా తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. షర్మిల మే 5వ తేదీ వరకు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఈలోపు తన తరపు లాయర్లు బెయిల్ కు అప్లై చేసి .. అందుకు కోర్ట్ అనుమతిస్తే తప్ప. ఈ రోజు ఉదయం కాసేపటి క్రితమే షర్మిల తల్లి విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ఇక్కడ షర్మిలను కలుసుకున్న విజయమ్మ ఆమెతో కాసేపు మాట్లాడి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా ఈ రోజు షర్మిల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్ట్ లో విచారణ చేయనున్నారు. మరి నాంపల్లి కోర్ట్ మెజిస్ట్రేట్ ఈ పిటిషన్ పై ఎటువంటి తీర్పును ఇస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.