‘హనుమాన్‌’ సినిమా అలాంటి వారికి చెంపదెబ్బ : చిలుకూరు ప్రధాన అర్చకులు

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో రూపొందిన చిత్రం హను-మాన్‌. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ250 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సక్సెస్ సాధించిన నేపథ్యంలో హనుమాన్ టీమ్ తాజాగా థ్యాంక్యూ మీట్‌ నిర్వహించింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు.

తన నామాన్ని జపిస్తే బుద్ధి, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని శ్రీరామభక్త ఆంజనేయస్వామి ప్రసాదిస్తారని రంగరాజన్ తెలిపారు. ప్రేక్షకులంతా ఆయన్ని తలచుకునేలా చేసిన ఈ చిత్రబృందానికి కృతజ్ఞతలు చెప్పారు. అర్చకులనేవారు రెండు రకాల పాత్రలు పోషిస్తారని.. భక్తుల ప్రతినిధిగా గర్భగుడిలోకి వెళ్లడం ఒకటైతే.. స్వామివారి ప్రతినిధిగా గర్భగుడి నుంచి బయటకు రావడం ఇంకొకటి అని అన్నారు. ఈ సినిమా చూసి తనకు మాటలు రాలేదన్న రంగరాజన్.. కథ విషయంలో ప్రశాంత్‌ సోదరి చక్కగా రీసెర్చ్‌ చేశారని కొనియాడారు.

“ప్రస్తుత రోజుల్లో సినిమా కీలక మాధ్యమం. సమాజానికి విలువైన చిత్రాలను అందించాలి. ‘హను-మాన్‌’లో ఎక్కడా అసభ్యత కనిపించలేదు. ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే హిట్‌ అవుతుందనే ఆలోచనలో ఉన్నవాళ్లకు ఇదొక చెంపదెబ్బ’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news