Telangana : టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈనెల 29వ తేదీ లోపు రూ. 4000 ఆలస్య రుసుముతో కలిపి ఫీజులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శనివారం ఉత్తర్వులను జారీచేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు తేదీని పెంచుతున్నామని తెలిపింది.

Tenth exam fee schedule has arrived
Extension of Tenth, Inter exam fee payment deadline

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. కాగా, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు తాత్కాల్ స్కీమ్ కింద చెల్లించే ఫీజు గడువును ఫిబ్రవరి 5 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. మార్చిలో జరిగే ఈ పరీక్షల కోసం రూ. 1000 ఆలస్య రుసుముతో కలిపి ఫిబ్రవరి 5లోపు చెల్లించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news